అద‌ర‌గొట్టేలా ర‌వితేజ `క్రాక్‌` టైటిల్ పోస్ట‌ర్‌

తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా అన్ని ఎలిమెంట్స్‌తో  మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మలినేని కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం `క్రాక్‌`. డాన్‌శీను, బ‌లుపు చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో  స‌ర‌స్వ‌తి ఫిలిమ్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి.మ‌ధు నిర్మాత‌గా ఈ హ్యాట్రిక్  చిత్రం తెర‌కెక్కుతోంది. స‌ముద్ర‌ఖ‌ని, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్ పూర్త‌య్యాయి చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది.ఈ ఏడాది స‌మ్మ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

ర‌వితేజ‌ ఈ చిత్రంలో ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం టైటిల్ పోస్ట‌ర్‌లో ర‌వితేజ మాస్ లుక్‌కు అదిరిపోతోంది. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేసిన ఈ టైటిల్ పోస్ట‌ర్‌లో  ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఇన్‌టెన్స్ లుక్‌, చేతిలో గోలీసోడాను ప‌ట్టుకున్న ర‌వితేజ  క‌నిపిస్తాడు.   బ్యాక్‌సైడ్ ఖైదీలు నిల‌బ‌డి ఉండ‌టాన్ని చూడొచ్చు. 

  ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ సంగీత సార‌థ్యం వ‌హిస్తున్నారు. మెర్స‌ల్‌, బిగిల్ చిత్రాల‌ల్లో విజువ‌ల్ బ్యూటీ అందించిన జి.కె.విష్ణు ఈ సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

Leave a Reply

Your email address will not be published.