టీడీపీ యువ నేత ఆత్మహత్యాయత్నం : వేధింపులే కారణమా


శ్రీకాకుళం జిల్లా టీడీపీ యువనేత, జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ 
చౌదరిలక్ష్మికుమారుడు ఆత్మహత్యాయత్నంకు  ప్రయత్నించడం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ చౌదరి కుమారుడు అవినాష్ ఎచ్చెర్ల  ఏకంగా పోలీస్‌స్టేషన్ భవనంపై నుంచి దూకేశాడు. వెంటనే గమనించిన పోలీసులు అతడ్ని శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అవినాష్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు, కార్యకర్తలు రిమ్స్ దగ్గరకు చేరుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అవినాష్‌కు వేధింపులు ఎక్కువయ్యాయనే నేపథ్యంలో వేధింపులకు తట్టుకోలేక ఈ పని చేసాడని టీడీపీ ఆరోపిస్తున్నది. 

అలాగే ప్రతీ గొడవకు అవినాష్‌ను బాధ్యుడిని చేస్తూ ఎచ్చర్ల పోలీసులు కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. ఎస్సై రాజేష్ తనను వేధిస్తున్నారంటూ అవినాష్ తీవ్ర మనస్థాపం చెందాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గతంలో ఎస్‌ఎంపురం సర్పంచ్‌గా అవినాష్ పనిచేశాడు. అవినాష్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనను హుటాహుటిన శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. పోలీసులు తీరుపై జిల్లా టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం వేధింపుల కారణంగానే అవినాష్ ఆత్మహత్యాయత్నం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినాష్ ఆత్మహత్యాయత్నంపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published.