గోడ మీద వార్తలు

                             

01 . బిక్షగాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాదుని తీర్చిదిద్దే ఆలోచనలో అధికారులు …

అట్నా – మరి ఎలచ్ఛన్లప్పుడు ఇంటింటికీ ఓట్లడుక్కోటానికొచ్చేటోళ్ళ సంగతేంటి – ఆళ్ళ నుండి విముక్తి లేదా జనానికి..??

02. జగన్ బలమైన నాయకుడు – కాబట్టే ట్రంప్ తో విందుకు అతనిని ఆహ్వానించలేదని మేం అనుకుంటున్నాం – బొత్స …

అంటే ఏంటి బాబాయ్ …?? ఎంత నీ జబ్బంత 
లేకపోతే మాత్రం – దొరవారు నీకు మరీ అంత బలహీనంగా ఆన్తన్నారా…???

03. మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్ తో పాక్ సంబంధాలు మెరుగుపడవు – పాక్ క్రికెటర్ ఆఫ్రిదీ …

ఏడిసావ్ – ఆకాటికి ఇంతకు ముందేదో ఒకర్నొకరు గట్టిగా వాటేసేస్కుని తొక్కుడుబిల్ల ఆడేస్కున్నట్టు …!!

04. రాబోయే పదవ తరగతి – ఇంటర్ పరీక్షలకి ఇన్విజిలేటర్లుగా వార్డు / గ్రామ వాలంటీర్లని నియమిస్తామని ప్రకటించిన – ఏపీ సర్కారు …

పన్లోపని పేపర్లు కూడా ఆళ్ళనే దిద్దేమంటే సరి – ఉత్తీర్ణత ఎక్కువ శాతం ఉన్న స్టేటంటూ సంకలు గుద్దేసుకోవచ్చు …!!

 
05. ఉత్తరాంధ్ర పర్యటనలో వైకాపా వారి లెక్కలు తేలుస్తా – చంద్రబాబు …

కేలుక్యులేటర్లేవఁన్న పంపియ్యమంటారా లేక రెండో ఎక్కంతో సరిపెట్టేస్తారా…??

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 

“ తెలుగు వారందరం తెలుగు లోనే మాట్లాడుకుందాం ” 


:||: జై హింద్ :||:

Leave a Reply

Your email address will not be published.