జగన్ సర్కార్ కి ఒక గుడ్ న్యూస్, ఒక బాడ్ న్యూస్.?రాష్ట్ర రాజధాని ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చని అది ఆయా రాష్ట్రాల అంతర్గత వ్యవహారమని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయి స్పష్టం చేశారు.
మూడు రాజధానులు వ్యవహారంపై ఏపీలోని  గందరగోళం పరిస్థితులపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  2015లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నోట్ ఫై చేశారని గుర్తు చేస్తూ ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియాలో రిపోర్టుల లో చూడటమే కాని తమ వద్దకు ఎలాంటి  ప్రతిపాదన రాలేదని స్పష్టం చేశారు.  రాజధానులు ఏర్పాటుపై రాష్ట్రాలదే  తుది నిర్ణయమని స్పష్టం చేశారు
ఇది ఇలా ఉండగా
ప్రభుత్వ కార్యాలయాలు కర్నూలుకు తరలింపుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాజధానిపై పిటీషన్లు పెండింగ్లో ఉన్నాయి అలాంటప్పుడు ప్రభుత్వ కార్యాలయాలని  కర్నూలుకు ఎలా తరలిస్తారని అని ప్రశ్నించింది.  ఫిబ్రవరి 26 వరకు స్టేటస్ కో  ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసింది. ఈ సందర్భంగా ఇక్కడి కార్యాలయాల నిర్వహణ సరిగ్గా లేదని ఏజీ కోర్టుకు వివరించగా స్థానికంగా ఉన్న స్థలంలోనే కొత్త నిర్మాణాలు చేపట్టవచ్చు గా అంటూ జడ్జి ప్రశ్నించారు, కర్నూల్ కు ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది.  

Leave a Reply

Your email address will not be published.