ఆధార్‌తో గేమ్‌లాడొద్దు


కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్‌కార్డును లావాదేవాల స‌మ‌యంలో పాన్‌కార్డుకు బ‌దులుగా ఆధార్‌ను ఉప‌యోగించుకునే వెసులుబాటును క‌ల్పించింది. అంటే పాన్ కార్డు కావాల్సిన చోటల్లా మ‌న‌ ఆధార్ నెంబర్‌ను  ఇస్తే స‌రిపోతుంది. ఇక ఇదిలా ఉండ‌గా… మీరు ఆధార్‌కార్డు ఉప‌యోగించే ముందు జాగ్ర‌త్త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది.  ముందుగా ఈ విషయాన్ని  ఖచ్చితంగా గ‌మ‌నించాల్సిన బాధ్య‌త ఎంతైన  ఉంది. ఈ తప్పు చేస్తే రూ.10,000 జరిమానా తప్పదు. ఉదాహరణకు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, డీమ్యాట్ అకౌంట్, మ్యూచువల్ ఫండ్స్, రూ.50,000 కన్నా ఎక్కువైన కొనుగోళ్లకు పాన్ నెంబర్ తప్పనిసరి.  అయితే కేంద్ర ప్ర‌భుత్వం పాన్‌కార్డు అనేది అంద‌రికీ ఉండ‌ని ప‌క్షంలో  పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ కూడా వెల్లడించొచ్చు.  ఆధార్ నెంబర్ వెల్లడించే సమయంలో ఏదైనా తప్పు చేశారంటే రూ.10,000 జరిమానా కట్టాల్సి వస్తుంది జాగ్రత్త. ఎందుకో తెలుసుకంటే…ఫైనాన్స్ బిల్ 2019 లో ఆదాయపు పన్ను చట్టానికి సవరణలు చేశారు.

పాన్ కార్డు బదులు ఆధార్ నెంబర్ ఇవ్వొచ్చని నిబంధనల్ని మార్చడమే కాదు… ఒకవేళ ఆధార్ నెంబర్ తప్పుగా ఇస్తే రూ.10,000 జరిమానా చెల్లించాలని కూడా అందులో ఉంది. కొత్త నిబంధనల్ని చూస్తే ఆదాయపు పన్ను శాఖ రూల్స్ ప్రకారం పాన్ కార్డు తప్పనిసరైన చోట మీరు మీ ఆధార్ నెంబర్‌ను వెల్లడించినప్పుడు ఆ నెంబర్ సరిగ్గా ఉండాలి. ఆధార్ నెంబర్‌ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI జారీ చేస్తుంది. అయితే జరిమానా విధించే అధికారం మాత్రం UIDAI సంస్థది కాదు.

 ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 272బీ ప్రకారం పాన్ కార్డు విషయంలో చేసే తప్పులకు రూ.10,000 జరిమానా విధిస్తుంది. గతంలో ఈ జరిమానాలు పాన్ కార్డుకు మాత్రమే వర్తించేవి. ఎప్పుడైతే పాన్-ఆధార్ పరస్పర మార్పిడికి అవకాశం ఇచ్చారో.అప్ప‌టినుంచి కేంద్ర ప్ర‌భుత్వం ఆధార్ కు ఈ నిబంధన‌ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. అయితే ఇక‌పై ఆధార్ విష‌యంలో చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సిందిగా సూచ‌న‌లు. 

Leave a Reply

Your email address will not be published.