యంగ్ హీరోయిన్‌కి హార్ట్ ఎటాక్… పరిస్థితి విషయం

బాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో గెహనా వశీష్ట గురించి తెలియని వారుండరు. ఈమె పలు హిందీ మరియు తెలుగు భాషల్లో నటించింది. ప్రస్తుతం గెహనా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సడెన్‌గా హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. హీరోయిన్ల డైట్ గురించి ప్రత్యేకంగా చప్పక్కర్లేదు. వాళ్ళ అందాన్ని మెయిన్‌టెయిన్ చెయ్యడం కోసం వాళ్ళు పడే పాట్లు అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు గెహనాది కూడా అదే పరిస్థితి సరైన డైట్ తీసుకోకపోవడం ఎక్కువ పని ఒత్తికి గురవ్వడమే దీనికి కారణమని వైధ్యులు నిర్ధారించారు.
గుండెనొప్పి ఎక్కువగా ఉండడంతో గురువారం రోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు గెహనా దాంతో వైద్యులు ఆమెను పరీక్షించి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఆమెకు చికిత్సను అందిస్తున్నారు. ముంబై మలాడ్ ప్రాంతంలోని రక్ష హాస్పిటల్లో ఆమెకు చికిత్స జరుగుతోంది. ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 31 ఏళ్ల గెహనా గుండె పోటుతో పాటు లో బీపీ కారణంగా అనారోగ్యానికి గురైనట్టుగా తెలుస్తోంది. డయాబెటీస్ ఉండటంతో అందుకు సంబంధించిన మెడిసిన్స్‌తో పాటు కొన్ని ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే ఆమె ఓ వెబ్ సిరీస్ కోసం మద్ ఐలాండ్‌లో షూటింగ్ చేస్తుండగా గెహనా స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే స్పందించిన యూనిట్ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరే సమయానికి ఆమె పల్స్ పూర్తిగా ఆగిపోయినట్టుగా డాక్టర్లు వెల్లడించారు. షాక్ట్రీట్మెంట్ ద్వారా ప్రయత్నించగా ఆమె నాడి కొట్టుకోవడం ప్రారంభించిందని తెలిపారు. కానీ వైద్యానికి మాత్రం తన శరీరం అనుకూలించడంలేదని ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైధ్యులు వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ఇంత చిన్న వయసులో ఇలా జరగడంతో ఆమె ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. ఇకపోతే ఈమె కేవలం నటి మాత్రమే కాదు ఒక మోడల్ రంగం నుంచి బాలీవుడ్లో ప్రేవేశించింది.