రాశీఖన్నా కవయిత్రి

గత ఏడాది శ్రీనివాస కళ్యాణం చిత్రంలో నటించింది రాశీఖన్నా. ఆ సినిమా రిలీజై బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాశీ ఏం చేస్తోంది? అంటే సినిమాల కంటే ఫోటోషూట్లతోనే ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తోంది ఈ బ్యూటీ. తమిళంలో అయోగ్య, సైతాన్ కా బచ్చా అనే రెండు చిత్రాలు మినహా తెలుగులో వేరొక సినిమాకి సంతకం చేయలేదు. అయితే సామాజిక మాధ్యమాల్లో మాత్రం రాశీ నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటోంది.
మీకు దక్కిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? అని నన్ను అందరూ ప్రశ్నిస్తుంటారు. దానికి నా దగ్గర సరైన సమాధానం లేదు. ఏదో ఒక బెస్ట్ ని ఎంపిక చేసి చెప్పలేను. అయితే ఇదిగో నేను ఓ ఎమోషనల్ సీన్లో నటించాను. ఈ ప్రపంచాన్ని నేను నీ కళ్లలో ఒదిగిపోతున్న తీరును చూడగలను. అలసిపోయినట్టుగా ఓ నవ్వు నవ్వాను. మన కళ్లు మన ఆత్మకు కిటికీలు వంటివని నేను భావిస్తాను. అందుకే ఈ హగ్.. అంటూ పోయెట్రీ చెబుతూ ఇన్ స్టాలో ఓ ఫోటోని అభిమానులకు షేర్ చేసింది. ఇక ట్విట్టర్ లో వేరొక పోస్ట్ తోనూ ఆకట్టుకుంది. అక్కడ జెన్నిఫర్ ఆల్ఫోన్స్ నగోబ జాతర వీడియోని షేర్ చేసింది. గోండ్ జాతి గిరిజనులకు సంబంధించిన పూర్వీకుల చరిత్రతో కూడుకున్న డాక్యుమెంటరీ ఇది.. నా ఫేవరెట్ అని తెలిపారు రాశీ. 

Leave a Reply

Your email address will not be published.