కరోనా వైరస్ స్థానిక ఎన్నికలను తాకలేదు

 

ఎన్నికలపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంటుందని పలువురు ఈసీ దృష్టికి తీసుకురాగా అది ఎన్నికల నిర్వహరణకు ఎలాంటి ఇబ్బంది లేదని రమేష్‌ కుమార్‌ స్పష్టం చేసారు. శుక్రవారం జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశం కు సంబంధించిన వివ‌రాల‌ను  ఆయ‌న మీడియాకు వివ‌రిస్తూ, శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న క‌రోనా ప్ర‌భావం ఏపిలో ఉంటుంద‌ని తాము అనుకోవ‌టంలేద‌ని తేల్చి చెప్పారు. 
 స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలలోనే జరగనుండటంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్టు అధికారిక వ‌ర్గాలు తెలియ‌జేసాయని చెప్పారు.    ఎన్నికల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సైతం పరీక్షల వాయిదా దోహదపడుతుందని  రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌ ఈ విషయం తెలిపారు. 

 స్థానిక ఎన్నిక‌లు జ‌రిగేందుకు వీలుగా పదో తరగతి పరీక్షలు ఏప్రిల్‌ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం  చెప్పింద‌ని, దానికి తాము అంగీకరించామని ఆయన చెప్పారు. పరీక్షలు వాయిదా వేయాలని తామేమి ప్రభుత్వాన్ని కోరలేదని ఏపీ ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌బాబు ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పారు.   స్థానిక ఎన్నికలు మాత్రం బ్యాలెట్‌ పద్దతిలోనే నిర్వహిస్తున్నామ‌ని,  పంచాయతీతో పాటు మున్సిపల్‌ ఎన్నికలు  బ్యాలెట్ పద్దతిలో జ‌రుగుతాయ‌ని వెల్లడించారాయ‌న‌. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాలని, పాత పత్రాలు ఉన్నా అనుమతిస్తామని తెలిపారు. 

 

Leave a Reply

Your email address will not be published.