ఒక‌సారి పోతే మ‌ళ్ళీ తిరిగి రాదు

శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా రాబోతున్న చిత్రం మజిలీ. కాగా తాజాగా అయితే మజిలీ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ కథ హల్ చల్ చేస్తోంది. ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తోన్నట్లు తెలుస్తోంది.

ఇక వాలెంటైన్స్ చిత్రం ట్రైలర్ విడుదల అయింది. ప్రస్తుతం ట్రైలర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారని మళ్లీ నువ్వే ప్రూవ్ చేశావ్’, ‘ఒకసారి పొతే మళ్లీ తిరిగి రాదురా, అది వస్తువైనా మనిషైనా’ లాంటి డైలాగ్ లు బాగానే అలరిస్తున్నాయి.

ఇక ట్రైలర్ లో చైతు రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. యంగ్ గెటప్ లో ఒకలా.. సమంతతో పెళ్లి తరువాత గెడ్డంతో మరో గెటప్ లో కనిపించాడు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

Leave a Reply

Your email address will not be published.