భారీ గా పట్టుబడిన బంగారం …

ముంబై నుంచి అక్రమంగా కార్గో కొరియర్ ద్వారా తరలిస్తున్న 20 కేజీల బంగారాన్ని విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో  టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప‌ట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నలుగురు వ్యక్తులు అక్రమంగా    ఎటువంటి బిల్లులు లేకుండానే ముంబై నుంచి కార్గో కొరియర్‌ ద్వారా బంగారు, వెండి ఆభరణాలను విజయవాడకు   తీసుకువచ్చినట్టు తెలిపారు.  పన్నులు ఎగ్గొట్టిన ఈ  బంగారాన్ని అక్రమంగా  నగరంలోని పలు బంగారు దుకాణాలకు సరఫరా చేస్తున్నార‌ని, వీటి విలువ సుమారు 17 కోట్ల వరకు ఉంటుందని అంచనాగా చెప్పారు.
కొందరు వ్యపారులు బిల్లులు లేకుండా బంగారాన్ని గమ్యానికి చేర్చితే లక్షల్లో లాభం ఉండటంతో కొందరు వ్యాపారులు ఈ జీరో బిజినెస్‌ చేస్తున్నారని ఈ క్ర‌మంలోనే  20 కిలోల బంగారు ఆభరణాలను త‌ర‌లించ‌గా  టాస్క్ ఫోర్స్ పోలీసులకు దొరికిపోయార‌ని , అరెస్ట‌యిన న‌లుగురు వ్య‌క్తుల‌ నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్పష్టం చేశారు. 
 

Leave a Reply

Your email address will not be published.