“మన ప్లేట్లో మన బిర్యాని తిందాం” వెనుక ఇంత పెద్ద కదా …!

ఎన్నికలకు రెండు
సంవత్సరాల ముందే జగన్ తమ పార్టీ అంతర్గత సమావేశంలో   “మన ప్లేట్లో మన
బిర్యాని తిందాం, అధికారంలోకి రాగానే ప్ర‌తి ఒక్క‌రూ రెండింత‌లు
సంపాదించుకునేలా చూస్తానంటూ  చెప్పిన మాట‌కు అనుగుణంగానే ఇప్పుడు అడుగులు
ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోందన్న ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.  “పరిపాలన
వికేంద్రీకరణ” అంటున్నా తెరవెనుక ఇలాంటి ఇన్సైడర్ ట్రేడింగ్ కార‌ణంగానే
విశాఖ‌కు రాజ‌ధాని త‌ర‌లింపు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ట్టు విప‌క్షాల నేత‌లు
చెపుతున్నారు. 
విశాఖ లో భారీ భూములు కొనుగోలు చేసి ఇన్సైడ్
ట్రేడింగ్ లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద విజయ్ సాయి రెడ్డి వేల
ఎకరాలు కొన్నారని ప్రచారం జరుగుతోంది. త‌న‌కు విశాఖ‌లో కేవ‌లం ఓ
అపార్టుమెంటులో ఇల్లు మాత్ర‌మే ఉంద‌ని ఆయ‌న చెపుతున్నా, భోగాపురం భూముల
గురించి ఎందుకు వివ‌రించార‌ని నిల‌దీత‌లు మొద‌ల‌య్యాయి.
ఇక
కాంగ్రెస్ పార్టీ హ‌యాంలో మంత్రులుగా వెలుగొందిన బొత్స‌, కొండ్రుముర‌ళి,
గంట శ్రీ‌నివాస‌రావుల‌కు సంబంధించి ప‌ర‌వాడ ప్రాంతంలో విమానాశ్ర‌యం
వ‌స్తుంద‌ని భారీగా భూములు కొనుగోలు చేసారని, అయితే రాష్ట్ర విభ‌జ‌న‌,
అధికార మార్పుల‌తో ఇది కాస్త భోగాపురం వెళ్ల‌డంతో భూముల ధ‌ర‌లు కాస్త
త‌గ్గుముఖం ప‌ట్ట‌డం త‌దిత‌ర అంశాలు కూడా ఇప్పుడు వెలుగు చూస్తున్నాయని
కొంద‌రి మాట‌. సీఎం జగన్ అధికారంలోకి రాకముందు నుంచే ఈ రాజధాని మార్పు
ఆలోచన ఉందని,అందుకేఅందులో భాగంగానే ఎన్నికలకు ఏడాది ముందు నుంచే భూములు
కొనుగోలు చేశాం అని విశాఖ ఎంపి సత్యనారాయణ ఒక ఇంటర్వ్యూ లో చెప్పారంటే
ముందుగానే ఎంత పక్కా ప్లాన్‌తో వ్య‌వ‌హ‌రించారో అర్ధం చేసుకోవ‌చ్చన్న‌ది
వారిమాట‌. 
రాజధాని వస్తే తమ బ్రతుకులు మారతాయని సాగు చేసి
పండించుకునే భూమిని, పచ్చటి పొలాలను రాజధాని కోసం గత ప్రభుత్వానికి ఇస్తే,
ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం “పరిపాలన వికేంద్రీకరణ” అంటూ రాజధానిని
మారుస్తూ, “మీ భూములు తిరిగి ఇచ్చేస్తాం..” అంటూ.. ఉదరగొట్టే మాటలు
మాట్లాడటం ఎంతవరకు సబబో వైసీపీ నేతలకే తెలియాలి..  ఏది ఏమైనప్పటికీ పరిపాలన
వికేంద్రీకరనో లేక స్వార్థ రాజకీయాల వల్లనో ప్రజలు మోసపోతూనే ఉన్నారన్న‌ది
వాస్త‌వం.

Leave a Reply

Your email address will not be published.