దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై ద‌ర్యాప్తుకు క‌మిటీ

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలోని ఈ కమిషన్‌లో బాంబే హైకోర్టు మా జీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సిబిఐ మాజీ డైరెక్ట ర్ కార్తికేయన్ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్‌లో దర్యాప్తు చేయాలని విచారణ తేదీ నుంచి 6 నెలల్లో నివేదిక అ ందించాలని సుప్రీంకోర్టు కమిటీకి కమిటీని ఆదేశించింది. ఈ కేసులో మీడియా, సామాజికమాధ్యమాలపై కట్టడి చేయాలని  స్ప‌ష్ట‌మైన ఆదేశాలిస్తూ, ఎన్‌కౌంటర్‌పై ఉన్న ఇతర దర్యాప్తులపై తదుపరి ఆదేశాల వరకు వి చారణలు జరపవద్దని స్టే విధించింది.

ఈ కేసు   విచారణ ప్రారంభమైన అనంతరం అసలు ఈ పిటిషన్ ఎందుకు వేశారని పిటిషనర్ జి ఎస్ మణిని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించా రు. ఎన్‌కౌంటర్‌పై వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నానని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌లా ఉందని, అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని పిటిషనర్ వివరించారు.  దీనికి  తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి త‌న వాదనలు వినిపిస్తూ, ఇద్దరు నిందితులు పోలీసుల పిస్టళ్లను తీసుకుని కాల్పులు జరిపారని.. పియూసిఎల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించలేదని  వివరించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ విఎస్.సిర్పుర్కర్ నేతృత్వంలో దర్యాప్తు కమిటీని నియమిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇదే అంశంపై  విచార‌ణ ఆరంభించిన హైకోర్టు దిశ నిందితుల ఎన్‌కౌంటర్ మృతదేహాల పై  కూడా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకో వాలని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published.