గోడ మీద వార్తలు

                                 

01 . తమిళనాడులో భారీ వర్షాల వలన దేవాలయాల వద్ద పెరిగిన పూల ధరలు – కిలో 3000 పలుకుతున్న మల్లె పూలు …
దీన్తల్లీ – ఉల్లే అనుకుంటే – మల్లి కూడా కన్నీళ్ళు పెట్టిస్తందా …?? ఓ కేజీ మాయ్యకి పంపండ్రా మరిన్ని పూలెడతాడు సెవుల్లో…!!
02. జగన్ మతం మానవత్వం – కులం మాట తప్పనిదీ అంటే  – మిగిలిన మతాలకి మానవత్వం లేదు – మిగిలిన కులాలు మాట తప్పుతాయనా..?? పవన్ కళ్యాణ్ …
ఎనకటికి నీలాంటోడే రాజు గారి మొదటి భార్య మంచిదంటే – రెండో భార్య చెడ్డదని అర్థం చేస్కున్నాట్ట …!! 
03. భక్త బృందంతో సహా అమెరికా చెక్కేసి తన సొంత దీవిలో సెటిలైన నిత్యానంద – త్వరలో దాన్నే ఓ దేశంగా ప్రకటించుకునే ఆలోచనలో ఉన్నట్టు బోగట్టా …
అద్సరే గానీ – ఎవడూ లైఫ్ జాకెట్టు ఇయ్య కుండా – మొలతాడట్టుకోకుండా ఆడంత దూరం ఈదుకుంటూ ఎట్టా పోయాడంటావ్ …??
04. వాలంటీర్ల స్మార్ట్ ఫోన్ల కొనుగోలుపై రివర్స్ టెండరింగుకి పోయిన ఏపీ సర్కార్ – 83 కోట్లు తక్కువకి కోట్ చేసి తిరిగి కాంట్రాక్ట్ దక్కించు కున్న – పాత బిడ్డరు…
ఏటో…. మలయాళపోడు అరఁవమ్మాయిని పెళ్ళి చేస్కుంటే పుట్టిన కన్నడ పిల్లాడు తెలుగు మాట్లాడినంత కన్ఫ్యూజింగ్ గా ఉండాదబ్బ …!!
05. బ్యాంకులు దివాళా తీస్తే డిపాజిట్ పై బీమా కేవలం లక్ష రూపాయలేనని – బీమా పెంపుకి సంబంధించిన అంశాలేవీ తమ వద్ధ లేవనీ తెల్పిన – డిపాజిట్ ఇన్సూరన్స్ & క్రెడిట్ కార్పొరేషన్ …
రేయ్ – మాయ్యొచ్చాడు – బీమా లచ్చల్లచ్ఛలు పెంచేసాడని తెగ చిందులేసారు కదరా సామీ – ఏటదంతా ఎలచ్ఛన్ల ముందర క్రీము నాకేసిన ఖాళీ బిస్కట్టేనా…???

Leave a Reply

Your email address will not be published.