అగ్ర‌హీరోలంతా అగ్రస్థానం లో నిలబెడుతున్న ‘ఓ పిట్టా కథ’


టాలీవుడ్ లో అగ్ర‌హీరోలంతా ‘ఓ పిట్టా కథ’ సినిమాని తెగ ప్ర‌మోట్ చేసేస్తున్నారు. ఇది సామాజిక మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం ఇండ‌స్ట్రీలో  అంద‌రి త‌ల‌లో నాలుక   ప్రఖ్యాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మజీ కుమారుడు సంజ‌య్ న‌టించ‌డ‌మే. దీనికి తోడు ఈ సినిమాలో బ్రహ్మ‌జీ ఓ ముఖ్య పాత్ర పోషించాడు. వైవిధ్య‌మైన క‌థ‌తో రూపొందిన ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లై విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లూ అందుకుంటోంది.
 సంజయ్ తొలి చిత్రం ‘ఓ పిట్టా కథ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్ర‌త్యేకంగా పాల్గొని అంద‌రినీ అభినందిస్తే,  ప్రిన్స్‌ మహేష్ బాబు రొమాంటిక్-క్రైమ్ డ్రామా టీజర్‌ను విడుదల చేశారు. త‌దుప‌రి    ప్రభాస్ సంజయ్‌ని, చిత్ర యూనిట్‌ని శుభాకాంక్షలు అందిస్టూ ట్వీట్ల చేసారు.   జూనియర్ ఎన్టీఆర్ సంజయ్ హీరోగా నిల‌దొక్కుకోవాల‌ని త‌ను కోరుకుంటున్నాన‌ని ట్విట్టర్‌లో పేర్కొంటూ  “ఈ శుక్రవారం విడుదలైన‌ సంజయ్, నా స్నేహితుడు బ్రహ్మజీ   ఓ పిట్టాకథ బృందానికి శుభాకాంక్షలు” అని  చెప్పారు.

ఇక  నితిన్, వరుణ్ తేజ్  ఇతరులు కూడా ఈ  చిన్న చిత్రాన్ని ప్రమోట్ చేయ‌టం ఇప్పుడు ఉప‌యుక్తంగా మారింది. శుక్ర‌వారం విడుద‌లైన చిత్రాల‌లో ఓ పిట్ట‌క‌థ బాగుంద‌న్న గుడ్ టాక్ ద‌క్కించుకుంది.   Leave a Reply

Your email address will not be published.