రాక్షసుడుగా నాని

నాచురల్ స్టార్ నాని, యంగ్ హీరో సుధీర్ బాబు ల కాంబినేషన్లో ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ మూవీ ‘వి’. ఆసక్తికరమైన పాయింట్ ఆధారంగా ఈ చిత్రం ఆరంభమవుతుంది. ఇందులో నాని, రాక్షసుడుగా ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాని నిర్మాతలు చెపుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన నాని రాక్షసుడు లుక్‌ని మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది .
కాగా ఈ సినిమా లో రక్షకుడిగా నటిస్తున్న సుధీర్ బాబు లుక్ ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాని లుక్ విడుదల చేస్తూ… ఇటువంటి రాక్షసుడిని మీరు ఎక్కడా చూసి ఉండరు అంటూ చిత్ర నిర్మాత సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసారు. మెలితిప్పిన మీసం, చేతిలో కత్తెర పట్టుకుని ఎంతో గంభీరంగా ఉన్న నాచురల్ స్టార్ నాని పోస్టర్ విడుదల చేసిన కాసేపటికే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతుండటం విశేషం.
అదితి రావు హైదరీ, నివేత థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకు సైరా చిత్రానికి అద్భుత సంగీతం అందించిన అమిత్ త్రివేది సంగీతం సమకూరుస్తున్నారు. శరవేగంతో సినిమాని పూర్తి చేసి ఉగాది కానుకగా మార్చి 25న విడుదల చేయనున్నామని నిర్మాతలు మీడియాకు చెప్పారు.