తన కెరీర్ ట్రాక్ లోకి తెచ్చుకునేందుకు ప్రయతింస్తున్న సోఫియా …..

మహేష్ 1 నేనొక్కడినే సినిమాలో లండన్ బాబు అంటూ ఐటెమ్ సాంగ్ లో కనిపించిన సోఫియా చౌదరి. ఎప్పటిక ప్పుడు సోషల్ మీడియాలో తనదైన ఘాటు ఫొటోలతో కుర్రాళ్ళ మనసులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. నేనొక్కడినే లో చేసిన ఐటమ్ సాంగ్ అదిరిపోయేలా ఉన్నా సినిమా కాస్త డిజాస్టర్ కావడంతో సోఫియాకి అవకాశాలు దాదాపు రాకుండా పోయాయి. అయినా పట్టువదలని ఆ భామామణి.. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 14లో కంటెస్టెంట్ గా మెరిసి, నేనున్నాననిపించుకుంది.
మళ్లీ వెండితెరమీద మెరిసేందుకు చాలా రోజుల నుంచి యత్నిస్తున్న సోఫియా బికినీలో తన మార్కు అందాల ఆరబోసి జనాలను రెచ్చగొడుతోంది. రీసెంట్ గా ఇంటర్నెట్ ప్రపంచం లోకి వదిలిన ఫోటోలను చూస్తే… కెరీర్ ట్రాక్ లోకి తీసుకు వచ్చేందుకు ఎంత పరితపిస్తుందో ఇట్టే అర్ధమవుతుంది. ఇలా హాటు అందాలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సోఫియా ఛాన్సులెలా దక్కించుకుంటుందో చూడాలి మరి.