పూరిజగన్నాథ్ , ఛార్మి , విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం ….

‘ఇస్మార్ట్ శంకర్‘ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్న నటి ఛార్మి
హీరో విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. స్క్రిప్టు బలాన్ని చూసిన బాలీవుడ్ నిర్మాతలు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ చిత్ర నిర్మాణ భాగస్వాములు కావటంవిశేషం.
పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లోనూ రూపొందే ఈ చిత్రంలో మునుపెన్నడూ ధరించని పాత్రలో విజయ్ కనిపించనున్నాడు , ఇందుకోసం ఆయన తనని తాను పాత్ర కోసం తీర్చిదిద్దుకోడానికి కఠిన ఆహార నియమాలు పాటిస్తుండటంతో పాటు థాయిలాండ్ వెళ్లి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట పద్ధతుల్ని నేర్చుకుని వచ్చాడు. దీంతో విజయ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడనిపిస్తోంది.