వియంకులు కానున్న వెంకీ నాగార్జున

అక్కినేని- దగ్గుబాటి కుటుంబాల మధ్య సినిమా బంధాలే కాదు వ్యక్తిగత, బంధువులు కూడా. ఇప్పటికే నాగార్జున, వెంకటేష్ సొంత బావ బామ్మర్దులు. దగ్గుబాటి అక్కినేని కుటుంబాలు వియ్యం అభిమానులలో పెద్ద పండగ నే తీసుకొచ్చింది. దగ్గుబాటి రామానాయుడు కుమార్తె లక్ష్మిని 1985లో నాగార్జున వివాహం చేసుకున్నా, వీరి కాపురం కొన్ని కారణాలతో విడాకులకు దారి తీసింది. అలా అప్పుడు తెగిపోయిన బంధాన్ని ఇప్పుడు నాగార్జున చిన్న కొడుకు అఖిల్ కలిపే ప్రయత్నం చేస్తున్నాడంటూ సామాజిక మీడియాలో ఓ కథనం తెగ ట్రోల్ అవుతోంది. వెంకటేష్ చిన్న కూతురుతో నాగార్జున చిన్న కొడుకు తో పెళ్లి ఖాయం చేసుకున్నారన్నది దాని సారాంశం.
వరుసకు అల్లుడే కదా సొంత అల్లుడిని చేసుకుంటే తప్పేముందంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే కొందరు మాత్రం గత అనుభవాల దృష్ట్యా దగ్గుబాటి అక్కినేని కుటుంబాలకు వివాహ బంధం కలిసిరాలేదని, వెంకటేష్, నాగార్జున వియ్యంకులుగా మారడం మంచిది కాదని హెచ్చరిస్తుండటం గమనార్హం.
ఈ రెండు కుటుంబాలు కలవాలనేది పెద్దాయన రామానాయుడు ఆశ ని నిజం చేసేందుకు అఖిల్ ప్రయత్నిస్తుంటే మధ్యలో వాళ్లకిలేని బాధ మీకేంటో? అని సెటైర్లు పడుతున్నాయి. అప్పుడు విడిపోయారు కాబట్టి ఇప్పుడు అఖిల్ పెళ్లితో మరోసారి కలవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ సమర్ధనలు కనిపిస్తున్నాయి. మరి ఈ కథనం ఎంతవరకు వాస్తవ రూపం దాలుస్తుందో చూడాలి.