సెల‌బ్ర‌టీగా ఎదుగుతున్న బిగ్‌బాస్ హిమ‌జ‌


హిమ‌జ న‌టిగా  దాదాపు 14 సినిమాల్లో చిన్నా చిత‌క పాత్ర‌లతో నెట్టుకొస్తోంది. అయితే బిగ్ బాస్ సీజ‌న్ -3  లో పాల్గొన్నాక ఆమెకు మ‌రింత గుర్తింపును తెచ్చి పెట్టింద‌నే చెప్పాలి.  ప్ర‌స్తుతం ఆమె చేతిలో రెండు, మూడు పెద్ద హీరోల సినిమాలున్నాయంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. ఇప్ప‌డు ఆమె పెద్ద సెబ్ర‌టీగా కూడా మారిపోయింది.
 ఆదివారం విశాఖ‌ప‌ట్ట‌ణంలోని సంప‌త్ వినాయ‌క టెంపుల్ రోడ్డులో షిమి వోగ్ మొద‌టి అవుట్‌లెట్‌ను సినీ హిమ‌జ ఆదివారం ప్రారంభానికి వ‌చ్చేసి భారీ ఆఫ‌ర్ల‌ను కూడా విడుద‌ల చేసింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట‌లాడుతూ విశాఖ‌లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లకు  అన్ని ర‌కాల వ‌స్తువులు స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌కే ల‌భించేలా స్టోర్ ఏర్పాటు చేయ‌టం ఆనందంగా ఉంద‌ని అన్నారు. ఈ  స్టోర్లు ఏపిలో మ‌రిన్ని ఏర్పాటు కావాల‌ని అభిల‌షించారు.
షిమి వోగ్ స్టోర్ (వైజాగ్) అధినేత కందుల న‌వీన్‌కుమార్. 2015 లో ప్రారంభించ‌ బ‌డిన కొరియాకు చెందిన షిమి వోగ్ డిజైన‌ర్ బ్రాండ్ మాల్స్ ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో అత్యున్న‌త ప్ర‌మాణాలు క‌లిగి ఉంద‌న్నారు.  ఆస్ట్రేలియా, కెన‌డా, ర‌ష్యా, సింగ‌పూర్‌, స్పెయిన్‌, యూఏఈ త‌దిత‌ర 77 ప్రాంతాల్లో దీని అవుట్‌లెట్లు ఉన్నాయ‌ని తెలిపారు. ఇండియాలో 70కిపైగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1700 పైగా అవుట్‌లెట్లు ఉన్నాయ‌న్నారు. ఈ స్టోర్‌లో రూ.75 నుంచి రూ.1500 విలువ క‌లిగిన ఉత్ప‌త్తులు అందుబాటులో ఉన్నాయ‌ని వినియోగ దారులు అత్యున్న‌త‌మైన భారీ ఆఫ‌ర్ల‌ను కూడా ఇస్తున్నామ‌ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published.