రానా తేజ సినిమా పట్టాలేక్కెదేప్పుడు…

రానాతో తీసిన ‘నేనేరాజు నేనేమంత్రి’తో సూపర్ హిట్ కొట్టి మళ్లీ హిట్ ట్రాక్ లోకి వ‌చ్చిన ద‌ర్శ‌కుడు తేజ‌.‘సీత’ సినిమా కాస్త బాక్సాఫీస్ ముందు బోల్తా ప‌డ‌టంతో మళ్లీ ప్లాప్ ల బాట ప‌ట్టాడు. ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను రెండు భాగాలుగా చేసే ఛాన్సొచ్చినా ఆ భారం మోయ‌లేనంటూ ప‌క్క‌కి త‌ప్పుకున్నాడు.తాజాగా త‌న‌కు కలిసొచ్చిన కాంబినేషన్ తోనే మళ్ళీ మరో సినిమా చేసేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు టాలీవుడ్‌లో టాక్‌. ‘రానా’ హీరోగా పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌తో ఓ సినిమా చేసేందుకు ఇప్ప‌టికే స్క్రిప్ట్ ర‌డీ అయిన‌ట్టు విన‌వ‌స్తోంది.  ఈ చిత్రానికి ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ఖ‌రారు చేసిన‌ట్టు సోషల్ మీడియాలో క‌థ‌నాలు హల్ చల్ చేస్తున్నాయి.

మ‌రోవైపు ప్రస్తుతం రానా కేర‌ళ‌లో  ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో  ‘విరాట పర్వం` షూటింగ్ లో బిజీగా ఉన్నాడు . ఈ చిత్ర త‌దుప‌రి తేజా సినిమాని ప‌ట్టాలెక్కించే ఆస్కారం క‌నిపిస్తోంది. కాగా గ‌తంలో రానా, కాజ‌ల్‌ల‌తో తేజ ఆరంభించిన చ‌రిత్ర క‌థనే కొన్ని చేర్పులు మార్పుల‌తో తెర‌కెక్కించేందుకు ర‌డీ అవుతున్న‌ట్టు మ‌రో గుస‌గుస‌.

Leave a Reply

Your email address will not be published.