ఒకే ఫ్రేమ్‌లో ఆ నలుగురు!! ఒకే ఫ్రేమ్ లో కన్నుల పండుగే

ఒకే వేదిక.. ఒకే ఫ్రేమ్.. కానీ అందులో అందరూ టాప్ హీరోలు కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి- నటసింహా నందమూరి బాలకృష్ణ- కింగ్ నాగార్జున- కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఆసక్తికరం. అయితే ఈ ఫీట్ ఎక్కడ సాధ్యపడింది? అంటే ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్.. పొలిటీషియన్ .. కళాబంధు టీఎస్సార్ జాతీయ అవార్డుల వేదికపై ఇది సాధ్యమైంది. ఆదివారం సాయంత్రం బీచ్ సొగసుల విశాఖ నగరంలో జరిగిన టీఎస్సార్ -టీవీ 9 జాతీయ అవార్డుల వేదికపై ఈ దృశ్యం కన్నులపండుగ చేసింది. 2017-18 సీజన్ కి వరుసగా రెండేళ్లకు కలిపి ఈ అవార్డుల్ని అందించారు.

80లలో.. 90లలో చిరంజీవి – బాలకృష్ణ మధ్య  పోటాపోటీ గురించి తెలిసిందే. ఇప్పటికీ ఆ ఇద్దరు అగ్ర హీరోలుగా హోదాని కాపాడుకుంటూ బాక్సాఫీస్ వద్ద పోరు సాగిస్తున్నారు. వీళ్లకు తోడు మన్మధుడు నాగార్జున సైతం అంతే జోరు చూపిస్తున్నారు. మంచు మోహన్ బాబు గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నా .. రకరకాల వేదికలపై యాక్టివ్ గానే ఉన్నారు. వైజాగ్ లో జరిగిన అవార్డు కార్యక్రమంలో ఖైదీనంబర్ 150 చిత్రానికి, గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా చిరు, బాలయ్య సందడి చేశారు. నాగార్జునకు దేవదాస్, కీర్తి సురేష్ కి మహానటి పురస్కారాల్ని తెచ్చి పెట్టాయి. ఇదే వేదికపై పలువురు బాలీవుడ్ స్టార్లు అవార్డులు అందుకున్నారు. సీనియర్ నటి నగ్మకు జీవితసాఫల్య పురస్కారం అందించారు. శాతకర్ణిగా బాలయ్య నటనకు ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఖైదీనంబర్ 150 చిత్రానికి  మోస్ట్ పాపులర్ ఫిలిం అవార్డు దక్కింది. రాజేంద్ర ప్రసాద్, మోహన్ బాబు, విశాల్, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్ (ఉత్తమ నటి), రాశీ ఖన్నా, హెబ్బా పటేల్, పూజా హెగ్డే, విద్యా బాలన్, కీర్తి సురేష్, అదితీరావ్ హైదరీ, ప్రియమణి తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published.