ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోల అలజడి

ఒడిశా: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోల అలజడి చోటుచేసుకుంది. గ్రామంలో ఓ యువకుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. దీంతో ఇద్దరు మావోయిస్టులపై గ్రామస్థులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. 
వివరాల్లోకి వెళ్తే… ఏవోబీ సరిహద్దులోని చిత్రకొండ బ్లాక్‌ పరిధిలో జంతురాయి గ్రామానికి గత రాత్రి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. గ్రామానికి చెందిన ఓ యువకుడిని తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన గ్రామస్థులు వారిని అడ్డగించారు. దీంతో గ్రామస్థులు, మావోయిస్టుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం గ్రామస్థులు మావోయిస్టులపై రాళ్లతో దాడికి దిగారు. ఒక మావోయిస్టు అక్కడికక్కడే మృతి ప్రాణాలు కోల్పోయాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఇంకో మావోయిస్టు పారిపోయాడు. 
మృతుడు గుమ్మ ఏరియా కమిటీ సభ్యుడు హాద్మగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మావోయిస్టు నందిపూర్‌ ఏరియా కమిటీ సభ్యుడు జిపోను బీఎస్‌ఎఫ్‌‌ బలగాలు గుర్తించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.