రిప్లబిక్ డే పరేడ్ విశాఖ‌లోనే జరగొచ్చు..?
స‌చివాల‌యం త‌ర‌లింపుకు రంగం సిద్దం చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం అసెంబ్లీ స‌మావేశాలు కూడా విశాఖ‌లోనే నిర్వ‌హించాలని యోచిస్తోంద‌ని అధికారిక వ‌ర్గాలే చెపుతున్నారు. ఈ నెల18న కేబినెట్ సమావేశంలో సచివాలయం తరలింపు షెడ్యూల్‌పై చర్చించే అవ‌కాశం ఉంద‌ని భోగ‌ట్టా ఇటీవ‌ల శార‌దా పీఠానికి చెందిన కొంద‌రు విశాఖ వ‌చ్చిన జ‌గ‌న్‌ను క‌ల‌సి న‌ప్పుడు 23 లోపు సచివాలయం తరలింపు ప్రారంభం కావాలని సూచించడంతో పాటు ముఖ్య‌మంత్రి 20 లోగా విశాఖ‌లో ఆవాసం ఏర్పాటు చేసుకోవాల‌ని మ‌రికొంద‌రు జోతిష్యులు చెప్ప‌డంతో ఆమేర‌కు ఆంధ్రావ‌ర్శిటీ ప‌రిధిలో ఉన్నగెస్ఠ్ హౌజ్‌ని సిఎం క్యాంప్ ఆఫీస్‌గా ఏర్పాటు చేసేందుకు ఎంపిక చేసార‌ని చెపుతున్నారు. 

ఇప్పటికే 5శాఖలను తరలించాలని హెచ్‌వోడీల ఆదేశాలు అందాయని, ఈ నెల 20, 21 వ తేదీలలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఏడాది రిప్లబిక్ డే పరేడ్ కూడా విశాఖలో నిర్వహించే యోచనలో జగన్ సర్కార్ ఉందని సమాచారం. 

Leave a Reply

Your email address will not be published.