అంజ‌లి పై కొత్త వివాదం … అత‌ని వ‌ల్లే కెరీర్ నాశ‌న‌మా…?


జ‌ర్నీ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన భామ అంజ‌లి. ఆ త‌ర్వాత సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంలో సీత పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను అరించింది. గీతాంజ‌లి చిత్రంతో మ‌రింత మంచి పేరు తెచ్చుకుంది. అయితే టాలీవుడ్, కోలీవుడ్ లో అంజలి, హీరో జై డేటింగ్ వ్యవహారం గురించి అందరికి తెలిసిన విషయమే. వీరిద్దరి లవ్ ఓపెన్ సీక్రెట్. వీరిద్దరు కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో కూడా ఉన్నారు. అలాంటి వీరిద్దరు తాజాగా విడిపోయారు.

ఇక తాజాగా ఓ నిర్మాత వీరిద్దరిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. హీరో జై, అంజలి కెరీర్ మొదట్లో జర్నీ సినిమాలో నటించారు. ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక 2017లో అంజలి, జై కలసి బెలూన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నిర్మాత నందకుమార్ నష్టపోయాడు. అంజలి చాలా మంచి అమ్మాయి అని.. కానీ ఆమె లైఫ్ లోకి హీరో జై వచ్చిన తర్వాత ట్రాక్ మారిపోయిందని ఆయన అన్నాడు.

అలాగే కొడైకెనాల్ లో హీరో, హీరోయిన్లకు వేర్వేరు రూమ్స్ బుక్ చేశాం. కానీ వారిద్దరు ఒకే రూంలో ఉండేవారు. మరో రూం క్యాన్సిల్ చేద్దామంటే జై ఒప్పుకునేవాడు కాదని.. దాంతో ఆ రూమ్ కి రోజు పన్నెండు వేల రూపాయ‌లు చొప్పున అద్దె చెల్లించామ‌ని ఆయన అన్నారు. షూటింగ్ టైంలో అంజలిని పేరు పెట్టి పిలిస్తే జై గొడవపడేవాడని.. మేడమ్ అని పిల‌వాలని.. లేకుంటే షూటింగ్ ఆపేస్తానని బెదిరించేవాడని తెలిపాడు.

అలానే కావాలని షూటింగ్స్ ఎగ్గొట్టేవాడని.. అంజలి చేత కూడా రకరకల సాకులు చెప్పించి ఆమెని కూడా షూటింగ్ కు రాకుండా చేశేవాడని నందకుమార్ చెప్పారు. ఇలా అంజలి కెరీర్ ను జై ఆడుకున్నాడని.. అతని వల్లే అంజలికి కష్టాలు ఎదురయ్యాయని ఆరోపించాడు. 

Leave a Reply

Your email address will not be published.