రాయ్ లక్ష్మీ టీచర్ చుట్టూనే ..! -శ్రీధర్ రెడ్డి

రాయ్ లక్ష్మీ ప్రధాన పాత్ర పోషించిన కామెడీ ఎంటర్‌టైనర్ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి సమర్పణలో ఏబీటీ క్రియేషన్స్ నిర్మించింది. ఎం. శ్రీధర్ రెడ్డి, హెచ్. ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి నిర్మాతలు. నూతన దర్శకుడు కిషోర్ కుమార్ దర్శకత్వ ం వహించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం.శ్రీధర్ రెడ్డి మీడియాతో ముచ్చట్లివి..

మీ స్వగతం?
నా స్వస్థలం అనంతపురం. నేను ఇంజనీరింగ్ చదివాను. కొన్నాళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేశాను. అటుపై బిజినెస్ చేస్తూనే.. ఇప్పటికి నిర్మాతగా పని చేస్తున్నా. నేను నిర్మతగా మారడానికి దిల్ రాజు స్ఫూర్తి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నే రోజులు నుంచీ ఆయన గురించి తెలుసుకుంటూ ఉన్నాను. ఆయన సినిమాలు తీసే విధానం నచ్చే.. నాకూ నిర్మాత అవ్వాలనిపించింది.

దిల్ రాజు .. ఫ్యామిలీ జోనర్ కదా! మీరు హర్రర్ చేస్తున్నారు?
‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’ మొత్తం హర్రర్ నేపథ్య ంలో చిత్రం కాదు. హర్రర్ ఎలిమెంట్స్ కొంత భాగం మాత్రమే. ఈ సినిమా పూర్తి కామెడీతో అలరించే వినోదాత్మక చిత్రం. రచయిత తటవర్తి కిరణ్ ఈ కథ చెప్పగానే నచ్చి, వెంటనే దర్శకుడు కిషోర్ కుమార్ ను బరిలోకి తెచ్చాం. రాజీ పడకుండా తీశాం.

రాయ్ లక్ష్మీనే ఎంచుకోవడానికి కారణం?
కొందరిని అనుకున్నాం. కానీ వెంకటలక్ష్మిగా రాయ్ లక్ష్మీ అయితేనే న్యాయం జరుగుతుందనిపించింది. నేనే ఆమెను ఎంపిక చేసుకున్నా. ఇప్పటివరకూ రాయ్ లక్ష్మీకు తెలుగులో ఆమెకు తగ్గ పాత్రలను ఎవ్వరూ ఇవ్వలేదు. ఈ సినిమా తనకు పేరు తెస్తుంది.

కథాంశం?
గ్రామీణ నేపథ్యంలో వెంకటలక్ష్మి అనే చిన్నపిల్లల టీచర్ చుట్టూ తిరిగే కథ ఇది. సినిమాలో ప్రధానంగా కామెడీ, హాస్య ం..టు థ్రిల్లింగ్ అంశాలు ఉంటాయి. వినోదంతో పాటు సస్పెన్స్ మరిపిస్తాయి.
తదుపరి చిత్రాలు?
పెద్ద సినిమా చేయాలి. రెండు మూడు కథలున్నాయి. ఈ రిలీజ్ తరువాతే ఏం చెయ్యాలో ఫైనల్ చేస్తాం.

Leave a Reply

Your email address will not be published.