కోడ్ వర్డ్ ఇదేనంటున్న షెర్లీన్ చోప్రా

ఫుల్ మేల్ డామినేషన్ ఉన్న సమాజంలోనే పరిస్థితి అలా ఉంటే ఈ జనరేషన్ పరిస్థితి మరింతగా దిగజారి ఉంటుందనడంలో అనుమానం ఏముంది? ఇప్పుడు కూడా కాంత దాసులే. దాంతోపాటుగా కొంతమంది మగానుభావులు మహిళలను వస్తువులుగా చూడడం కూడా ఎక్కువైంది. అదే క్యాస్టింగ్ కోచ్ కు మూలం. దాదాపు రంగాల్లో ఉన్నట్టే సినిమా రంగంలో కూడా ఈ గోల ఉంది.. కాకపోతే కాస్త ఎక్కువగా ఉంది. ఈ టాపిక్ గురించి ఎన్నో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బాలీవుడ్ భామ షెర్లీన్ చోప్రా ఈ టాపిక్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
రీసెంట్ గా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ లో అవకాశం ఇచ్చేందుకు కొందరు ‘అది’ అడుగుతారని.. దానికి ఒక కోడ్ వర్డ్ ఉందని.. ఆ కోడ్ వర్డ్ ‘డిన్నర్’ అని చెప్పింది. ఎవరైనా కొత్త నటీమణులు అవకాశాలకోసం తిరిగే సమయంలో ‘డిన్నర్ కు వస్తారా’ అని అడుగుతారు. కానీ తన మొద్దుబుర్రకు ఈ విషయం అర్థం కావడానికే రెండేళ్ళు పట్టిందట. తనకు తెలిసిన డిన్నర్ వేరని.. వారు అడిగే డిన్నర్ వేరని అర్థం చేసుకున్న తర్వాత అవాక్కయిందట. ఈమధ్యే ‘టున్ను టున్నూ కర్తా హై’ అనే పాట విడుదల సందర్భంగా ఈ కామెంట్లు చేసింది ఈ అమ్మడు.