గోడ మీద వార్తలు


01 వచ్చిన ప్రతిసారి సమస్యలు వినిపోతున్నారు గానీ పనులు జరగటం లేదని జన్మభూమి కార్య క్రమాన్ని బహిష్కరించిన – తూగో రౌతులపూడి మండల ప్రజలు …

యాండోయ్ బాబుగోరూ… తమరు మొన్నెప్పుడో ఇపరీతంగా లభించేస్తందన్న వీర విశేష స్పందన ఇదేనా …??  బానే స్పందిస్తన్నట్టున్నారుగా ..!!

02. యూపీలో ముజాఫర్ నగర్ లో గోమాంసం  అమ్మే ఓ ఇద్దరిని ఎన్కౌంటర్ చేసిపారేసిన – పోలీసులు  …

మంచిది – ఈళ్ళకన్నా ముందర ఆటిని ఈళ్ళకి అమ్మిన అడ్డగాడిదలనీ – పాలు పితుక్కు…బ్బి గడ్డెట్టకుండా రోడ్ల మీద ప్లాస్టిక్ కవర్లు తిని చావమని గాలికొదిలేసిన గాడిదలనీ లేపేయండ్రా – మనకెట్టాగూ తూటాలు ఫ్రీనే కదా…!!

03. కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలు – ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సులర్ …

అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అంటూ తాటాకుల పట్టుకు తిరిగే బ్యాచులకిది ఇది అర్ధం కాదు గానీ మేష్టారు – కుదిరితే ఇట్టాంటాటి మీద పీహెచ్ఢీలు పెట్టండి సామీ…!!

04. ప్రయాగ్ రాజ్ లో జరిగే కుంభమేళాకి వచ్చే భక్తులందరికీ ఇన్సూరెన్సు చేయించే ఆలోచనలో – యూపీ సర్కారు …

మంచి ఆలోచన – క్లెయిము సెటిల్మెంటుల్లో ప్రాంప్టు పేమెంటు చేసే రిలయన్సు ఇన్సూరెన్సే దీనికీ అన్ని విధాలా తగిన సంస్థని ఓ దేశభక్తుడిగా నా నమ్మకం …!!

05. మధ్యప్రదేశ్ మాజీ సీయంకి భాజపా అద్యక్ష పదవి – గడ్కరీకి ఉపప్రధానినీ చేసి అమిత్ షా ని పక్కన పెట్టాలి – ఆరెస్సెస్ లేఖ …

అడవి తగలడ్డాక ఆకులు పట్టుకున్నారనీ – ఎట్టకేలకు రంధ్రాన్వేషణ చేసి మరీ పార్టీకి బొక్కపెడుతున్న పెద్ద రంధ్రాన్ని గుర్తించారన్న మాట…!!

మరిన్ని వార్తల కోసం – నిత్యం చూస్తూనే ఉండండి – నా గోడ …!! 

Leave a Reply

Your email address will not be published.