తండ్రిని కడసారి చూపుకూ నోచుకోని అమృత

పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీ రావు ఆత్మహత్య కలకలం రేపుతోంది. మారుతీరావు ఆత్మహత్యకు ప్రధానంగా మానసిక ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులే కారణాలని సమీప మిత్రులు, బంధువులు చెబుతున్నారు
తాజాగా ఆయన అంత్యక్రియలు సోమవారం మిర్యాలగూడలోని శ్మశానవాటికలో మారుతీరావు అంత్యక్రియలు జరుగుతున్న వేళ, ఆయన కుమార్తె అమృత తండ్రికి తుదిసారి నివాళులు అర్పించాలంటూ అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో తండ్రిని పొట్టన పెట్టుకున్న కసాయి కుమార్తె అంటూ ‘మారుతీరావు అమర్ రహే’, ‘అమృత గో బ్యాక్’ అంటూ కొందరు నినాదాలు చేశారు. పోలీసు వాహనంలో వచ్చిన వాహనాన్ని బంధుమిత్రులు అడ్డుకున్నారు.
ఇరు వర్గాలకూ పోలీసులు నచ్చజెప్పి, అమృతను మారుతీరావు ఇంటికి చేర్చారు. అయితే బంధువులు ఇంట్లోకి రావద్దని కట్టడి చేయటంతో తండ్రి మృతదేహాన్ని చూడలేక పోయారు. కనీసం తల్లిని పలకరించేందుకు కూడా ఇబ్బందికర క్షణాలు ఏర్పడటంతో కొద్ది సేపటిలోనే ఆమెను పోలీసులు అక్కడ నుచి తీసుకువెళ్లి పోయారు. ఆపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ తన అన్నఅంత్యక్రియలు నిర్వహించారు.