ఎంజిఆర్గా అరవింద స్వామి లుక్స్ అదుర్స్..

శుక్రవారం తమిళ నాట లెజెండరీ ఎం జి రామచంద్రన్ జయంతిని అంతా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. వెండి తెరపై రాజకీయాలలోనూ పేదల పక్షాన నిలచే కథానాయకుడిగా వెలుగొందిన ఎంజిఆర్ ఇప్పటికీ అక్కడి జనంలో సజీవ రూపంగానే నిలుస్తున్నారు. ఎంజిఆర్ జయంతిని సందర్భంగా జయలలిత బయోపిక్ తలైవి నుంచి ఎం జి ఆర్ రోల్ చేస్తున్న అరవింద స్వామి ఫస్టులుక్ రిలీజ్ చేస్తే చాలా మంది జయలలితగా టైటిల్ రోల్ చేస్తున్న కంగనా రనౌత్ లుక్ కన్నా ఎంజిఆర్గా అరవింద స్వామి లుక్ అదిరిపోయిందంటూ అందరూ పొగిడేస్తున్నారు.
బక్కపలుచగా ఉండే కంగనా కు ఎంత మేకప్ వేసినా జయలలిత రూపం రాలేదని, జయలలితగా కంగనా కంటే, ఎం జి ఆర్ గా అరవింద స్వామి బాగున్నాడంటూ పోలికలు మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తుండగా, హర్షవర్ధన్ ఇందుకూరి నిర్మిస్తున్న విషయం విదితమే. మరి సినిమా పూర్తయ్యేనాటికి ఇంకా ఎన్ని కామెంట్లు రానున్నాయో చూడాలి.