రాజస్థాన్‌ రాయల్స్‌లో ‘షేన్ వార్న్’ షేర్ ఎంతో తెలుసా

రాజస్థాన్‌ రాయల్స్‌లో తనకు ఉన్న చిన్న వాటాతో పెద్ద మొత్తంలో డబ్బులు రానున్నాయని ఆసీస్‌ మాజీ స్పిన్నర్‌ షేన్ వార్న్ మీడియాకు తెలిపాడు.  2008 ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌ లో వార్న్‌ కు రూ. 4 కోట్లు చెల్లించిన రాజస్థాన్ రాయ‌ల్స్ ఈ జ‌ట్టులో 0.75 వాటాను కూడా అప్ప‌ట్లో ఇచ్చింది.
 ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కు గుడ్‌ బై చెప్పిన త‌దుప‌రి ఫ్రాంచైజీ కోరిక మేరకు కెప్టెన్‌ గా, కోచ్‌ టీమ్‌ ను నడిపించేందుకు అంగీక‌రించిన నేప‌థ్యంలో కుదిరిన ఒప్పందం మేర‌కు  నాకు వాటా ఇచ్చింది అని వార్న్‌ పేర్కొన్నాడు.  ఇలా నాలుగేళ్ల పాటు ప్లేయర్‌గా  ఆడిన ఈ లెజెండ్‌ స్పిన్నర్‌ వాటా ఇప్పుడు మూడు శాతానికి పెరిగిందట‌.
 ప్రస్తుతం రాజస్థాన్‌ ఫ్రాంచైజీ విలువ రూ. 14 వేల కోట్లు (200 మిలియన్‌ డాలర్లు)గా ఉంది. మరో రెండు, మూడేళ్లలో ఇది డబుల్‌ కానుందని సమాచారం. అంటే 400 మిలియన్‌ డాలర్లలో మూడు శాతం వాటా అంటే దాదాపు 12 మిలియన్‌ డాలర్లు (రూ. 85కోట్లు ) వార్న్‌కు దక్కనున్నాయి.  

Leave a Reply

Your email address will not be published.