అమలాపాల్ తండ్రి పాల్ వర్గీస్ అంత్యక్రియలు…

బెజవాడ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోయిన్ అమలాపాల్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అమలా పాల్ తండ్రి వర్గీస్ పాల్ హఠాత్తుగా ప్రాణాలు విడిచారు. గత కొంతకాలంగా అతను అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే, హఠాత్తుగా మరణించడంతో చెన్నై సినిమా బిజీలో ఉన్న అమలా పాల్ హుటాహుటిన చెన్నై నుంచి కేరళ వెళ్ళింది. కేరళలో ఈరోజు పాల్ వర్గీస్ అంత్యక్రియలు జరగబోతున్నాయి. 
తాజాగా అమలాపాల్  తమిళ్, మలయాళంలో మాత్రం ఫుల్ బిజీగా ఉందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత..మెగా ఆఫర్ కొట్టేసింది. రామ్ చరణ్ నాయక్ సినిమాతో మంచి విజయాని అందుకుంది  ఈ భామ. అనంతరం  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా ఇద్దరమ్మాయిలతో చిత్రంతో అమలాపాల్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఇదిలా ఉంటె, దర్శకుడిని వివాహం చేసుకొని ఆ తరువాత విడిపోయి మరలా ఆమె సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత.. ఈ భామ బోల్డ్ గా నటించి మెప్పించింది అమలా పాల్.

Leave a Reply

Your email address will not be published.