కొత్త‌గా చైతు…

సమంత, నాగ చైతన్య హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం మజిలీ. ఫెయిల్ అయిన ఒక క్రికెటర్ జీవితంలోకి.. భర్తే ప్రాణం అని నమ్మే ఒక అమ్మాయి భార్యగా వస్తే.. ఆ తరువాత అతని లైఫ్ ఎలా మారుతుంది, తిరిగి అతను జీవితంలో ఎలా ఎదిగాడు అనే పాయింట్ బేస్ చేసుకుని శివ నిర్వాణ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.
అయితే చైతు క్యారెక్టర్ సినిమాలో చాలా కొత్తగా ఉండబోతుందట.. పైగా ఆయన కెరీర్ లోనే ఇలాంటి క్యారెక్టర్ ఇదివరకూ ఎప్పుడు చెయ్యలేదట.
ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల అయి నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ‘వెధవలకు ఎప్పుడూ మంచి పెళ్ళాలే దొరుకుతారని మళ్లీ నువ్వే ప్రూవ్ చేశావ్’ లాంటి డైలాగ్ లు బాగానే అలరించాయి. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా నటి దివ్యంశ కౌశిక్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. మ‌రి ఈ డిఫ‌రెంట్ పాత్ర‌లో చై ఎలా క‌నిపిస్తారో త‌న న‌ట‌నతో ప్రేక్ష‌కుల‌ను ఏ విధంగా ఆక‌ట్టుకోబుతున్నారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published.