విశాఖ శారదాపీఠంలో సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖలోని శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా .గత ఐదు రోజులుగా జరుగుతున్న విశ్వశాంతి హోమంలో పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన .స్వయంజ్యోతి మండపాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ శారదాపీఠంకెతెర్ర లోనూ , ఆగమ యాగశాలలో జరుగుతోన్న హోమం పూర్ణాహుతిలో జగన్ పాల్గొన్నారు.
మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సీఎం జగన్ శారదాపీఠం నుంచి 12.50కి బయలు దేరి నేరుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరాక మధ్యాహ్నం 2.10 గంటలకు తాడేపల్లిలోని స్వగృహానికి చేరుకుంటారని సిఎంఓ తెలిపింది. కాగా సీఎం హోదాలో శారదాపీఠానికి రెండోసారి జగన్ రావటం విశేషం.