మ‌గాళ్ళ క‌ళ్లెప్పుడూ ఆడ‌వాళ్ళ వ‌క్షోజాల పైనేనా లేడీ సింగ‌ర్ షాకింగ్ కామెంట్స్‌…?

చిన్మ‌యి ఈ పేరు విన‌గానే మ‌న‌కు ముందు గుర్తొచ్చేది ఓ స్వీట్ వాయిస్.  త‌ను ఒక ప్ర‌ముఖ సింగ‌ర్ అంతేకాక డ‌బ్బింగ్ కూడా చెపుతుంటుంది. అయితే ఇటీవ‌లె ఆమె ఓ ఘ‌ట‌న పై స్పందించారు. ఇటీవ‌లె స్విగ్గీలో ఫుడ్ ఆర్డ‌ర్ చేసిన ఓ మ‌హిళ పై డెలివ‌రీ బాయ్ చేసిన కామెంట్స్ గురించి ఆమె స్పందించారు. 

ఆ విష‌యాన్ని ఆమె సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు. స్విగ్గీలో ఫుడ్ ఆర్డ‌ర్ పెట్టిన ఓ మహిళ ఆర్డ‌ర్ రాగానే అది తీసుకోడానికి వెళ్ళింది. డెలివరీ బాయ్ ఫుడ్ ఆర్డర్ ఇవ్వడానికి  వెళ్లాడు. అయితే ఆర్డర్ తీసుకోవడానికి వచ్చిన ఆ యువతిని చూసి ‘అన్నీ కనిపిస్తున్నాయి చున్నీ కప్పుకోండి’ అన్నాడట. దాంతో ఆమెకు ఒళ్లుమండింది. తనకు ఎదురైన ఈ అనుభవం గురించి సోషల్ మీడియాలో పేర్కొంది.

‘స్విగ్గీ.. మీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి పని వారు చేసుకుంటే మంచిది అని చెప్పంది. మీ సంస్థకు చెందిన ఓ డెలివరీ ఏజెంట్ పార్సిల్ ఇవ్వడానికి వచ్చి చున్నీ కప్పుకో అని నాకు చెప్పి సలహా ఇచ్చి వెళ్తున్నాడు. నా ఇంట్లో నా ఇష్ట‌మొచ్చిన‌ట్లు ఉంటాను చెప్ప‌డానికి త‌నెవ‌రూ అంటూ కోపాన్ని వ్య‌క్తం చేసింది. దీంతో కొంత సూప‌టికే ఆ న్యూస్ వైర‌ల్ అయింది. నెటిజ‌న్లు కొంత మంది ఆమెకు స‌పోర్ట్ చేస్తే మ‌రికొంద‌రు కామెంట్స్ చేశారు. తనను ఎగతాళి చేస్తున్నవారిపై స్పందిస్తూ.. ‘ఈ ఘటన గురించి ఎవరైనా జోక్‌గా కామెంట్లు చేస్తే అందరినీ బ్లాక్ చేస్తాను’ అని బెదిరించింది.


అయితే ఈ ట్వీట్స్‌పై చిన్మయి ఆ మహిళకు మద్దతు తెలుపుతూ పచ్చిగా కామెంట్స్ చేశారు. ‘మహిళల వక్షోజాలను చూసే మగాళ్లను చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే.. వారు చిన్నప్పుడు తల్లి వద్ద పాలు తాగి ఉండరు. ఓ మహిళ చున్నీతో తన ఒళ్లు కప్పుకోకపోతే వాటి వల్లే రేప్స్ జరుగుతాయి అనుకుంటారు. కొంతమంది డెలివరీ ఏజెంట్‌ను సపోర్ట్ చేస్తున్నారు. ఒక డెలివరీ ఏజెంట్‌కు అతను ఫుడ్ తీసుకెళ్లే ఇళ్లన్నీ ఆఫీసులతోనే సమానం. మన దగ్గర డ్రైవర్‌గా, సర్వెంట్స్‌గా పనిచేసేవారికి మన ఇళ్లు ఆఫీసులే’ అని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.


ఇక‌పోతే చిన్మ‌యి ఇలాంటి వివాదాల్లో త‌ల‌దూర్చ‌డం అనేది మొద‌టిసారి కాదు. గతంలో ఆమె ప్రముఖ లిరిసిస్ట్ వైరాముత్తుపై లైంగిక ఆరోపణలు చేసినప్పుడు కూడా పలువురు నెటిజన్ల నుంచి అసభ్యకరమైన కామెంట్స్ వచ్చాయి. అలా కామెంట్లు చేసేవారికి వారి భాషలోనే సమాధానం ఇచ్చి నోరుమూయించేవారు. అప్పుడప్పుడూ చిన్మయికి నటి సమంత కూడా సపోర్ట్ చేసేవారు. చిన్మయికి సమంత మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక చిన్మ‌యి యాక్ట‌ర్ మ‌రియు డైరెక్ట‌ర్ అయిన రాహుల్ ర‌వీంద్ర‌న్ కి భార్య‌. రాహుల్ ఇటీవ‌లె మ‌న్మ‌ధుడు-2 ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply

Your email address will not be published.