సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖ ఈసీ తిరుగు లేఖ

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయటంపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సమయంలో అందుకు అనుగుణంగా రాష్ట్రంపై కరోనా ప్రభావం లేదని, మరోవైపు ఎన్నికలు యథావిధిగా జరపాలని.. సీఎస్ నీలం సాహ్ని రాసిన లేఖపై ఈసీ రమేష్ కుమార్ తిరుగు లేఖ రాసారు. దీని ప్రతిని మీడియాకు విడుదల చేశారు.
ఐదు వేల కోట్లు డబ్బులు ఆగిపొతాయంటూ చేస్తున్న వాదన సరికాదని ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు సంబంధం ఉండదని, ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందని రమేష్‌కుమార్ తన లేఖలో స్పష్టం చేసారు. ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాల మేరకే ఎన్నికలు వాయిదా వేసామని తేల్చి చెప్పారు. కరోనా వైరస్ ప్రభావంతో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిలపివేసిన విషయాన్నిగుర్తు చేసారు. కరోనా ఎన్నికల కారణంగా విస్తృతం అయ్యే ఆస్కారం ఉందని తేల్చి చెప్పారు.