విశాఖ శివార్ల‌లో సైబ‌ర్ క్లౌడ్‌ సిటీ?

తెలుగుదేశం పార్టీ ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఉన్న‌ప్పుడు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ల‌కి తోడుగా  సైబరాబాద్ పేరుతో మ‌రో హైటెక్ న‌గ‌రాన్ని సృష్టించినట్టే  విశాఖ శివారులో ఓ క్లౌడ్‌ సిటీని నిర్మించాలని  గ‌త ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని అమ‌లు చేసేందుకు ఎపి సిఎం జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం.  విశాఖ నుంచి భోగాపురం వరకు విస్త‌రించేలా ఈ   కొత్త నగరాన్ని అటు విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం జిల్లాల‌ల‌కు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. 
 పచ్చని కొండలు, విశాలమైన రోడ్డు, సముద్రతీరం కలిగిన విశాఖ శివార్ల‌లో 1,350 ఎకరాల్లో ఈసిటీని నిర్మించాల‌ని యోచిస్తున్న‌ట్టు తెలియ‌వ‌చ్చింది. దేశంలోనే సముద్రం మీదుగా విమా నం ల్యాండ్‌ అయ్యే అవకాశం ఒక్క భోగాపురం లో ఉండేలా విమానాశ్రయం నిర్మాణం జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఇది టూరిజానికి ప్రత్యేక ఆకర్షణగా నిల‌వ‌నుంది. 
అలాగే కాపుల ప్పాడులో అదానీ డేటా సెంటర్‌ పార్క్‌ కోసం అదాని గ్రూప్‌ 20ఏళ్లలో  రూ.70వేల కోట్లు పెట్టుబడితో 28వేల మందికి ప్రత్యక్షంగా, 85వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మ‌రం చేసింది. దీనికి తోడు  ఇక్క‌ 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1గిగా వాట్‌ డేటా సెంటర్ కు ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసేకున్న ఈసెంటర్‌ ప్రపంచంలోనే మొట్టమెదటి పర్యావరణహిత డేటా సెంటర్‌ పార్క్‌గా చరిత్రలో నిలిచిపోవ‌టం ఖాయంగా అధికారిక వ‌ర్గాలు చెపుతున్నారు. ఈడేటా సెంటర్‌ ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్నెట్‌ సేవలు అందించే కీలక కేంద్రంగా మారనున్న నేప‌థ్యంలో  దీనిలో భాగంగానే 5గిగా వాట్స్‌ సోలార్‌ పార్క్‌ని కూడా ఏర్పాటు చేసారు.  అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు,  పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారిక వ‌ర్గాల అంచ‌నా.
 మధురువాడ హిల్‌ నెంబర్‌ 3లో  రూ.145కోట్లతో నిర్మించిన మిలీనియం టవర్‌ మొత్తం గ్రౌండ్‌ ఫ్లోర్‌ కాకుండా ఏడు అంతస్తులుగా నిర్మించారు. 2లక్షల స్క్యేర్‌ ఫీట్ల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈటవర్‌ తొలిదశలో 1600 మంది ఉద్యోగులతో ప్రారంభమై ఏడాదిలోగా 4500మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది.  వీటికి తోడు ఇప్పటికే విశాఖలో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు గ‌త ప్రభుత్వం పలు రాయితీలు కల్పించి, కంపెనీలకు అనుగుణంగా పాలసీలు రూపొందించి పెట్టుబడులను ఆహ్వానించింది. ఐటీ కంపెనీలు ఏపీలో పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నాప్ర‌స్తుత‌ అనుకూల వాతావరణం ఇబ్బంది పెడుతోంది.  దీంతో విశాఖపట్టణంలో కాస్త ప్ర‌శాంత వాతావ‌ర‌ణం ఎక్కువగా ఆక‌ర్షించే అవ‌కాశాలున్న‌ట్టు అధికార వ‌ర్గాల అంచ‌నా.
కాగా మిలీనియం ట‌వ‌ర్న్‌ని పూర్తి స్థాయి సెక్ర‌టేరియ‌ట్‌గా మార్చేందుకు ప్ర‌బుత్వం నిర్ణ‌యించిన  క్ర‌మంలోనే ఇందులో ఉన్న సాఫ్ట్ వేర్ కంపెనీల‌ను విశాఖ‌లోని వివిధ ప్రాంతాల‌కు త‌ర‌లించేందుకు సిద్దం చేస్తున్నార‌ని స‌మాచారం అందుతోంది. వీరిని నిలువ‌రించేందుకు కొత్త సిటీలో కొన్ని భూములు వీరికి అందిచాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 
విశాఖ శివార్ల‌లో సైబ‌ర్ క్లౌడ్‌ సిటీ?

Leave a Reply

Your email address will not be published.