అమ‌రావ‌తి రాజధాని గా అంగీక‌రించ‌లేని సిఎం జ‌గ‌న్….అమ‌రావ‌తి రాజధాని గా అంగీక‌రించ‌లేని సిఎం జ‌గ‌న్ మూడు రాజ‌ధానులంటూ డ్రామాలాడుతున్నార‌ని, దీనిని వ్య‌తిరేకిస్తు విప‌క్షాలు, రైతులు చేస్తున్న ఉద్య‌మం రాష్ట్రం న‌లుదిశ‌లా  పాకిందని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు.  శ‌నివారం ఆయ‌న అమరావతిలో మీడియాలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సందర్భంగా రాజధాని హైదరాబాద్‌ కోల్పోయామని.. అలాంటి పరిస్థితి రాకూడదనే చంద్రబాబు  అమరావతిని రాజధానిగా నిర్ణయించి అభివృద్ధి దిశ‌గా ప‌య‌నిస్తున్న త‌రుణంలో రాష్ట్రంలో దుర‌దృష్ట‌వ‌శాత్తు  ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావ‌టం అమరావతి, పోల‌వ‌రం ల‌లో ఎలాంటి పనులు చేపట్టకుండా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని, ప్ర‌స్తుతం జ‌నంలో హోదా, రాజ‌ధానుల విష‌యంలో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి తప్పించుకునేం దుకు జ‌నం మ‌ధ్య ప్రాంతీయ విభేదాలు సృష్టించి గందరగోళ పరిస్థితులు తెచ్చిపెట్టార‌ని జ‌య‌దేవ్‌ మండిపడ్డారు.

రాజధాని గ్రామాల్లో అక్రమ అరెస్ట్‌లు, మహిళలపై లాఠీచార్జ్‌ దారుణ‌మ‌ని, రాజధాని రైతులు నక్సలైట్లుగా ప్ర‌భుత్వం భావిస్తున్నందునే టెర్రరిస్ట్‌ ప్రాంతంలో ఉండాల్సిన సెక్షన్లు రాజ‌ధాని గ్రామాల‌లో  పెట్టారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. రాజ‌ధానిలో సామాన్య ప్ర‌జ‌లు న‌డిచేందుకు కూడా భ‌య‌ప‌డేలా చేస్తున్నార‌ని, తక్షణమే  పోలీసులు 144 సెక్షన్‌ ఎత్తేయాలని డిమాండ్ చేశారు.  రాజధానికి రైతులు భూములిచ్చింది… పోలీసులతో తన్నించుకోవడానికా? అని నిల‌దీసారు గల్లా జయదేవ్ . 

Leave a Reply

Your email address will not be published.