దిల్‌రాజ్ సొంత సంస్ధ హీరో రౌడీ బాయ్స్ గా రాబోతున్నాడు

టాలీవుడ్లో మంచి జోరుమీదున్న నిర్మాతగా పేరున్న దిల్ రాజు తొలుత పంపిణీదారుగా రంగప్రవేశం చేసి, ఎన్నోలోతు పల్లాలు చూస్తూ, నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్నారు. కొత్త దర్శకులను వెతికి పట్టుకోవటంలోనూ, కొత్త టాలెంట్‌ని గుర్తించి ప్రోత్సహించడంతో పాటు కుటుంబ కథా చిత్రాలను, ప్రేక్షకులు మెచ్చేసినిమాలు చేయడంలో ఆయనది అందె వేసిన చేయిగా చెపుతారు ఇండస్ట్రీలో .
దిల్‌రాజు ఇంతగా ఎదగటం వెనుక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కో- ప్రొడ్యూసర్ గా ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ వర్క్ చూసుకునే శిరీష్ దే కీలక పాత్ర అనటంలో సందేహం లేదు. దిల్‌రాజుకు కుడిభుజంలా మారిన శిరీష్ తాజాగా తన తనయుడు ఆశిష్ ని హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ గా తీసుకువచ్చే ప్రయత్నాలలో ఉన్నారు. ఇందుకు దిల్రాజుకూడా ప్రోత్సహిస్తున్నాడట.
కాగా గతేడాది చిన్న సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ సాధించిన ‘హుషారు‘ ఆ చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఆశిష్ హీరోగా రూపొందే సినిమాకి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం అందుతోంది. అలాగే ఈ సినిమాకి ‘పలుకే బంగారమాయే’ అనే టైటిల్ ను అనుకుని దానికి ‘బొమ్మరిల్లు’లో అనే ట్యాగ్ లైన్ కూడా ఫిక్స్ చేశారు. అయితే ఏమయిందో ఏమో కానీ ఈ సినిమా టైటిల్ రౌడీ బాయ్స్ గా మార్చారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై దిల్‌రాజే స్వయంగా ప్రకటించే ఆస్కారం ఉంది. అందునా దిల్‌రాజు సంస్ధ నుంచి వస్తున్న హీరో ఆశిష్ కావటంతో ఇండస్ట్రీలో ప్రత్యేక అంచనాలేర్పడ్డాయి.