ఆర్టీసీ నగదు రహిత ప్రయాణానికి శ్రీ‌కారం
ఇక‌పై ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత ప్రయాణం ద్వారా ప్ర‌యాణీకుల‌ను ఆక‌ట్టుకోవాల‌ని నిర్ణ‌యించి, త‌మ  బస్సుల్లో నగదు రహిత ప్రయాణానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌ శ్రీ‌కారం చుట్టింది  ఇందుకు సంబంధించి ఛలో మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. ముందుగా ఈ  పైలెట్‌ ప్రాజెక్టును ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు విజయవాడలో ప్రారంభించారు. 

ఈ యాప్‌ను ఆర్టీసీ వైఎస్‌ చైర్మన్‌, ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఆవిష్కరించిన అనంత‌రం మీడియాలో మాట్లాడుతూ.. 2.5 లక్షల ప్రయాణికులకు ఛలో యాప్‌ ఉపయోగకరంగా మారనుందని అన్నారు.  యాప్‌తో పాటు స్మార్ట్‌ కార్డులను కూడా ఆర్టీసీ అందుబాటులోకి తెసుకువ‌చ్చిన‌ట్టు చెప్పారు. కండ‌క్ట‌ర్లు, డ్రైవ‌ర్ల వ‌ద్ద ఉన్న‌ టిమ్‌ మిషన్‌ ద్వారా స్మార్ట్‌ కార్డులను ఉపయోగించకోవచ్చని ఆర్టీసీ ఎండీ ప్రతాప్‌ తెలిపారు.

 ప్ర‌ధానంగా త‌మ సిబ్బంది ఎదుర్కొంటున్న చిల్లర సమస్య ఎదురుకాకుండా ఉంటుంద‌ని, అలాగే ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుందని చెప్పారు. ప్ర‌యాణీకులు చేతిలో నగదు లేద‌ని ఏటిఎంల కోసం వెతుకులాట అవ‌స‌రం ఉండ‌ద‌ని,  కార్డు ద్వారా ప్రయాణం చేయొచ్చని అన్నారు. -ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published.