పవన్ కల్యాణ్ పై మండిపడ్డ రోజా

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. బీజేపీ-జనసేన పొత్తుపై ఎమ్మోల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీల కల్యాణ్, పొత్తుల కల్యాణ్ గా మారారని విమర్శించారు. శుక్రవారం మీడియా సమావేశంలో రోజా మాట్లాడారు. పవన్ పై విమర్శలు గుప్పించారు రోజా. పొత్తులు, ప్యాకేజీల కోసమే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టినట్లుందన్నారు ఎమ్మెల్యే రోజా. పాచిపోయిన లడ్డూలు..ఇప్పుడు తాజాగా మారాయా అని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ గతంలో పోరాటం చేసిన పవన్ తాజాగా పోరాటం ఎందుకు ఆపారో చెప్పాలని నిలదీశారు.
జగన్ ను ఎలా ఎదుర్కోవాలో తెలియక విపక్ష పార్టీలు ఏకమవుతున్నాయని పేర్కొన్నారు. పవన్ సినిమాలో పాత్రలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారన్నారు. పవన్ లాంటి వారు యూత్ ఐకాన్ ఎప్పటికీ కాలేరని పేర్కొన్నారు. బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టిన సీఎం రమేష్, సుజనాతో
పాటు పవన్ ను ఎందుకు బీజేపీలోకి తీసుకున్నారో అర్ధం కావడంలేదని రోజా వ్యాఖ్యానించారు.