చిరంజీవితో స్టెప్స్ కు ఓకే చెప్పేశా : రెజీనా

ఎస్ఎంఎస్ సినిమాతో టాలీవుడ్‌కి వచ్చిన చెన్నై సొగసరి రెజీనా కసండ్ర ఇప్పుడు చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్యచిత్రంలో స్రత్యేక పాటలో తన అందాల ఆరబోతతో అలరించనుంది. ఈ విషయంపై ఆమె మీడియాలో మాట్లాడుతూ ‘‘చిరంజీవిగారి సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని దర్శకుడు అడగగానే మరో ఆలోచన మనసులోకి రాకుండా ఓకే చెప్పేశాను. అసలు ఆయన ఓ పెద్ద డాన్సర్, అలాంటిది ఆయనతో కలసి డాన్స్ చేయడం చాలా కష్టం అని తెలిసి కూడా అంగీకరించాను. ఆరు రోజుల పాటు చిత్రీకరించిన స్పెషల్ సాంగ్‌లో చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నా డాన్స్ చూసి అభినందించడం మరింత ఆనందంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
అసలు ఈ సాంగ్‌ని ఐటెమ్ సాంగ్ అనడం నాకు నచ్చటం లేదు. సెలబ్రేషన్స్ సాంగ్ అనొచ్చు కదా అని ప్రశ్నించింది రెజీనా. చిరంజీవి తో కలసి ఓ స్పెషల్ సాంగ్ చేయడం నాకు సరి కొత్త అనుభూతి. అయితే ఇదే తొలిసారి… చివరిసారి కూడా. ఇకపై ఇలాంటి స్పెషల్ సాంగ్స్‌లో నటించను’’ అని తేల్చి చెప్పింది రెజీనా.