ఆళ్ల రామకృష్ణారెడ్డి అరెస్ట్…

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి పెనుమాక నుండి పాదయాత్ర ప్రారంభించారు వైసీపీ ఎమ్మెల్యే.. ఏపీలో వికేంద్రీకరణ జరగాలి.. అభివృద్ధి అందరికి నినాదంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.. ఈ పాదయాత్రకు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో…భారీగా పోలీసులను మోహరించారు. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనలతో ఉద్రికత్త పరిస్థితులు తలెత్తడంతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేను అరెస్ట్ చేసి… మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు.