వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి… – లోకేశ్

రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసులని మోహరించి వారితో కవాతులు చేయించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తోందని టీడీపీ నేత, ఎమ్మెల్సీ లోకేశ్ విమర్శించారు. రైతుల పట్ల పోలీసులు తీసుకుంటున్న చర్యలని ట్విట్టర్లో ఖండించిన ఆయన, ఈ క్రమంలోనే శనివారం ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పలు ట్వీట్లు చేసారు. రైతులు ధర్నాలు చేసే టెంటులని పీకేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఆగిపోతుందనుకుంటే వారి భ్రమ… అని వ్యాఖ్యానించారు.
రైతులను నడి రోడ్డుపై ఎండలో కూర్చోబెట్టిన పాపం ఊరికే పోదని, సీఎం జగన్ నిరంకుశత్వ పాలనకి రాజధానిలో ఉన్న పరిస్థితులే నిదర్శనమని పేర్కొన్నారు. ఎంత తొక్కితే అంత ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుందని అధికార గణం తెలుసుకోవాలని అన్నారు. గ్రామాల్లో గుడికి తాళం వేసే దుస్థితి వచ్చిందంటే.. రాష్ట్రంలో ఎంత ఘోరమైన పరిపాలన ఉందో అర్థమవుతుందని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు గళం విప్పుతున్నారని… వైసీపీ ప్రభుత్వానికి పాడె కట్టడానికి లోకేశ్ పేర్కొన్నారు.