ఆర్ఆర్ఆర్.షూటింగ్ స్పాట్లో జండా వందన వేడుక…

జాతీయ భావాలు స్టేజ్పైనో, సినిమాలలోనో వ్యక్తం చేసే సినీ జనాలు రిపబ్లిక్‌డే, స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవటమన్నది కాస్త అరుదుగానే ఉంటుంది. అయితే దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తు ఉంటారు. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న తాజా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్.షూటింగ్ స్పాట్లో ఆయన రిపబ్లిక్ డే ని పురస్కరించుకుని జండా వందన వేడుకలని నిర్వహించారు. సెట్స్ లో ఎంతో ఘనంగా ఈ వేడుకను జరుపుకున్న ఫోటోలను సినిమా బృందం.‘నేడు మా ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ అంతా కలిసి ప్రజాస్వామ్య బద్దంగా రిపబ్లిక్ డే ని జరుపుకున్నాం’ అంటూ వారు ఫోటోలు పోస్ట్ చేయడం విశేషం.