జగన్‌పై టాలీవుడ్ నటుడు సుమన్ వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై టాలీవుడ్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల విషయంలో జగన్ ఉద్దేశం ఏంటో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. మాచర్లలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని సుమన్ ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అమరావతి ప్రాంత రైతులకు ఏం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవాలని చెప్పారు. రైతులకు మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్ తరపున తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌ను కలిసేందుకు ఐదు సార్లు ప్రయత్నించినట్లు చెప్పుకొచ్చారు. కానీ అపాయింట్మెంట్ దొరకలేదని వాపోయారు.
3 రాజధానులకు సుమన్ మద్దతు తెలుపుతున్నారో లేదో మాత్రం ఆయన స్పష్టంగా తెలియ జేయలేదు. అగ్ర నటుడు చిరంజీవి మాత్రం జగన్ నిర్ణయాన్ని స్వాగతించారు. నిర్మాత అశ్వనీదత్ మాత్రం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రైతులకు అండగా నిలిచారు. ఇక జనసేన అధినేత పవన్‌కల్యాణ్ మాత్రం రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు…