గిరిజన పండుగ మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతర ప్రారంభం …

ఆసియాలోనే అతి పెద్ద గిరిజన పండుగ మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర. మేడారం మహాజారకు రెండు రోజుల ముందే భక్తులతో కిటకిటలాడుతోంది. ఇటు తెలుగు రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలతో భక్తులు భారీ ఎత్తున్న మేడారానికి తరలివస్తున్నారు. వనదేవతల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో క్యూ కడుతున్నారు.  ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు కన్నుల పండుగా సాగే ఈ ఉత్సవానికి కోటి మందికిపైగా భక్తులు తరలివస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు… దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన తెగలు, ఆసియా ఖండంలోని దేశాల నుంచి కూడా తరలి రావడం ఈ పండుగ ప్రత్యేకత. 
ఇప్పటికే మేడారంకు పెద్ద ఎత్తున్న భక్తులు తరలివస్తున్నారు. దీంతో జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన అనంతరం భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. పుణ్యస్నానాల తర్వాతే సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. జంపన్నవాగులో స్నానం చేసి దర్శించుకుంటే తల్లులు కరుణిస్తారని భక్తుల నమ్మకం. నిన్న ఒక్కరోజే మేడారానికి 10 లక్షల మంది తరలివచ్చినట్లు అంచనా. 
అయితే, మేడారం.. సమ్మక్క, సారలమ్మ మహాజాతర ఈ నెల 5 బుధవారం నాడు జాతర అధికారికంగా మొదలుకానుంది. ఇదే రోజు సారలమ్మ గద్దె మీదకు వస్తుంది. 6న సమ్మక్క గద్దెను అధిష్టించనుంది. 7వ తేదీన భక్తుల దర్శనం, మొక్కుల చెల్లింపులు ఉంటాయి. 8వ తేదీన అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారు. 
భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు
అంతేకాకుండా తెలంగాణ కుంభమేళాగా భావించే మేడారం మహా జాతరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సర్వం సిద్ధం చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక దృష్టి పెట్టింది. అధికారులు, సిబ్బంది నిరంతరం జాతరను పర్యవేక్షిస్తున్నారు. జాతరకు ప్రత్యేక బస్సులు, రైళ్లు సిద్దం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. జాతరకు రోడ్డును సైతం వేయించారు. భక్తులకు బాత్రూంలు, వసతి, భోజనం.. ఇలా ప్రతి విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. మేడారం మహా జాతరకు కోటి మందికిపైగా రానున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది… 

Leave a Reply

Your email address will not be published.