రాజావారు రాణిగారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌

ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  బుధ‌వారం జెఆర్‌సీలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఇక్క‌డ‌కి గెస్ట్‌లుగా విచ్చేసిన రాజ్‌కందుకూరి, మ‌ధుర శ్రీ‌ధ‌ర్ సాంగ్స్‌ను విడుద‌ల చెయ్య‌గా, హీరో విశ్వ‌క్‌సేన్‌, డైరెక్ట‌ర్ త‌రుణ్‌భాస్క‌ర్ బిగ్‌సీడీని లాంచ్ చేశారు. ఇదే వేదిక పై హీరో విశ్వ‌క్‌సేన్ ప‌ద‌కొండువేలు పెట్టి బిగ్ టికెట్‌ను కొనుగోలుచేశారు. ఈ  సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…


ప్ర‌ముఖ నిర్మాత రాజ్‌కందుకూరి మాట్లాడుతూ… ఈ మ‌ధ్య వ‌చ్చిన చిన్న సినిమాల్లో ఇంత బ‌జ్‌ని క్రియేట్ చేసింది ఈ సినిమానే. ఈ సినిమా ప్ర‌మోష‌న్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అలాగే చాలా హార్డ్‌వ‌ర్క్ హానెస్టీ క‌నిపిస్తుంది. నేను ఈ సినిమా చూశాను. చాలా బావుంది. ర‌వికిర‌ణ్ ఏజ్‌కి చాలా మెచ్చూర్డ్‌గా డీల్ చేశాడు అనిపించింది. హీరో హీరోయిన్లు కూడా చాలా బాగా న‌టించారు. ఓవర్ ఆల్‌గా ఇది ఒక హానెస్టీ విలేజ్ ల‌వ్‌స్టోరీ అనే చెప్పాలి. ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్ ఎలా ఉందంటే చిన్న సినిమాలు కూడా పెద్ద వాటితో స‌హా రాజ్యం ఏలుతున్నాయి. మెయిన్‌గా కంటెంట్ ఈజ్ కింగ్ ఈ సినిమాలో నాకు ఆ పాజిటివిటీ క‌నిపిస్తుంది. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. ఎంటైర్‌టీమ్ కి నా ఆల్ ద బెస్ట్ పాటలు కూడా చాలా బావున్నాయి అని అన్నారు.


మ‌ధుర శ్రీ‌ధ‌ర్ మాట్లాడుతూ… వెంక‌ట్ సిద్ధా రెడ్డి ఫోన్ చేసి ఈ సినిమా చాలా బావుంటుంది చూడాలి అని చెప్పినప్పుడు చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. సింపుల్‌, హానెస్ట్‌గా ఉంటుంది. మ్యూజిక్ చాలా బావుంటుంది. ర‌వికిర‌ణ్ చాలా బాగా తీశారు. మ‌నో వికాస్ బాగా ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.


ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వెంక‌ట్‌సిద్ధారెడ్డి… సినిమా చాలా బాగా వ‌చ్చింది. ద‌ర్శ‌కుడికి నా కృత‌జ్ఞ‌త‌లు. సినిమా అయిపోయింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం వ‌ల్లే సినిమాని నెక్స్‌ట్‌లెవ‌ల్‌కి తీసుకెళ్ళాడు. ఒక హీరో లాగా కాకుండా చాలా క‌ష్ట‌ప్డాడు. సినిమాని సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్ చేతిలో పెట్టాడు. మ్యూజిక్ చాలా బాగా వ‌చ్చింది. సినిమా మీఅంద‌రికి బాగా న‌చ్చింది.


మ‌నోవికాస్ ప్రొడ్యూస‌ర్ మాట్లాడుతూ… చాలా ఆనందంగా ఉంది. రాజావారురాణిగారు చాలా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతుంది. నేను రెండు బిజినెస్‌లో లాస్ అయినా నా త‌ల్లిదండ్రులు న‌న్నుఈ సినిమా తియ్య‌డానికి ప్రోత్స‌హించారు. కిర‌ణ్‌ప్ర‌తిదీ నేర్పిస్తున్నాడు. కిర‌ణ్‌తోనే త‌ర్వాత ఏ సినిమా అయినా చేస్తాను. టీమ్ అంద‌రికీ చాలా ధ్యాంక్స్‌.


హీరోయిన్ ర‌హ‌స్యగోర‌క్‌ మాట్లాడుతూ… ఒక మూవీ ఇంత వ‌ర‌కు రావ‌డానికి దాని వెన‌కాల చాలా మంది ఉంటారు. మా డైరెక్ష‌న్ డిపార్ట్‌మెంట్‌, ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్‌మెంట్ చాలా క‌ష్ట‌ప‌డేవారు. ముఖ్యంగా వాళ్ళంద‌రికీ చాలా థ్యాంక్స్ మా ప్రొడ్యూస‌ర్ చాలా బాగా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా చేశారు. సినిమాలో టెక్నీషియ‌న్లకి చాలా థ్యాంక్స్‌. మీ అంద‌రికీ సినిమా బాగా న‌చ్చుతుంది. నాకు ఇంత మంచి ప్రామినెంట్ క్యారెక్ట‌ర్ ఇచ్చినందుకు మా డైరెక్ట‌ర్ కి చాలా థ్యాంక్స్. నేను చూసిన యాక్ట‌ర్స్‌లో కిర‌ణ్ చాలా డెడికేటెడ్ ప‌ర్స‌న్‌. ప్ర‌తిదీ డిటెయిల్డ్‌గా తెలుసుకుని సినిమాల్లోకి ఎంట‌ర్ అయ్యాడు. సినిమా తియ్యడం ఒక ఎత్తు రిలీజ్ చెయ్య‌డం ఒక ఎత్తు. సురేష్‌బాబు సార్ చాలా థ్యాంక్యూ మా సినిమాని విడుద‌ల చేస్తున్నందుకు. ఇది ఫ్యామిలీ మొత్తం క‌లిసి చూడ‌ద‌గ్గ సినిమా. ఇది ఒక ప్యూర్ ల‌వ్ స్టోరీ. మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది అని అన్నారు.


డైరెక్ట‌ర్ ర‌వికిర‌ణ్ మాట్లాడుతూ… స్క్రిప్ట్‌ని న‌మ్మి మ‌నోవికాస్ డ‌బ్బులు పెట్టాడు. ఆర్టిస్ట్‌లంద‌రూ కెరియ‌ర్‌ని ప‌న్నంగా పెట్టి న‌టించారు. టెక్నీషియ‌న్స్ కూడా చాలా టాలెంటెడ్‌. టీజ‌ర్ విడుద‌ల‌య్యాక ఇండ‌స్ట్రీలో ప్రతి ఒక్క‌రూ ఫోన్ చేసి సినిమా ఇంత బాగా తీశారేంటి అన్నారు. సురేష్‌ప్రొడ‌క్ష‌న్స్‌, మీడియా 9 మాకు చాలా స‌పోర్ట్ చేశారు. ఈ సినిమాని న‌డిపించింది వీళ్ళంద‌రూ నేను చేసింది ఏమీ లేద‌నిపించింది. న‌న్నుస‌పోర్ట్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు. ఒక జ‌న్యూన్ స‌బ్జెక్ట్ అంద‌రూ క‌లిసి చూడ‌ద‌గ్గ చిత్రం ఇది. ఈ సినిమా చూసిన ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చస్తున్నారు. విలేజ్‌లో చిన్న‌ప‌ల్లెటూరులో జ‌రిగే ల‌వ్‌స్టోరీ. అన్ని ర‌కాలుగా ఈ సినిమా క‌చ్చితంగా న‌చ్చుతుంది. మీరంద‌రూ త‌ప్ప‌కుండా ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అని అన్నారు.


బిగ్‌బాస్ రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ…నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక స్టేజ్ మీద నాకు ఇంత క్రేజ్ వ‌స్తుంద‌ని. ట్రైలర్ చాలా బావుంది. మొట్ట మొద‌టిసారి నేను ఆడియో లాంచ్ లో మాట్లాడ‌టం. సాంగ్స్ కూడా చాలా బావున్నాయి. టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్యూ సో మ‌చ్ అన్నారు.


విశ్వ‌క్‌సేన్ మాట్లాడుతూ… ఏ బిజినెస్‌లోనైనా స‌రే వెన‌క్కి లాగ‌డం ఉంటుంది కాని. సినిమా విష‌యానికి వ‌స్తే కంటెంట్ బావుంటే ఎవ్వ‌రూ లాగినా ఆగ‌దు. థియేట‌ర్‌కి ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి. సినిమా ర‌వి చాలా ప‌ర్‌ఫెక్ట్‌గా  తీశాడు. హీరో  కూడా చాలా బాగా చేశాడు. నాకుఈ సినిమా బాగా న‌చ్చింది. నేను వీళ్ళు పిల‌వ‌క‌పోయినా వ‌చ్చేవాడ్ని టీమ్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.


హీరో కిర‌ణ్‌ అబ్బ‌వ‌ర‌పు మాట్లాడుతూ… ముందుగా ఇక్క‌డ‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ చాలా థ్యాంక్స్‌.  టీమ్ గురించి చెప్పాలంటే డైరెక్ష‌న్ టీమ్‌, ప్రొడ‌క్ష‌న్‌టీమ్ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమాని బాగా న‌మ్మాము. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ఈ సినిమా చాలా బావుంది. న‌వంబ‌ర్ 29 మీ అంద‌రికీ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉంటుంది. మీ చిన్న‌ప్ప‌టి విష‌యాల‌న్నీ గుర్తుకువ‌స్తాయి. టెక్నీషియ‌న్స్ చాలా బాగా వ‌ర్క్ చేశారు. థ్యాక్యూ సోమ‌చ్ విక్కీ మ‌నోజ్ అన్నా. సురేష్ కి కూడా సినిమా చాలా బాగా న‌చ్చింది. నేను చాలా హ్యాపీ ఫీల‌య్యాను. సినిమా మీ అంద‌రికీ త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. మేము కొత్త వాళ్ళం కాబ‌ట్టి కొంచం డ‌వుట్ త‌ప్పించి సినిమా మాత్రం చాలా బావుంటుంది. వ‌ర్ల‌డ్ వైడ్ గా ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. అంద‌రికీ థ్యాంక్యూ సోచ్ అని అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర యూనిట్‌, జ‌ర్న‌లిస్ట్ టిఎన్ ఆర్, యాద‌గిరి, మీడియా9 మ‌నోజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.