చిరంజీవి రికార్డుని బ్రేక్ చేసిన హీరో

చిరంజీవి రికార్డు సమం చేశాడు వెంకటేష్. ఇన్ని రోజులు సీనియర్ హీరోల్లో 100 కోట్లు వసూలు చేసింది కేవలం చిరంజీవి మాత్రమే. పదేళ్లు తర్వాత వచ్చి కూడా ఖైదీ నెంబర్150 సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దుమ్ము దులిపేశారు అన్నయ్య. ఇప్పుడు ఈయనకు తోడుగా వెంకటేష్ కూడా వచ్చేశారు.  ఏకంగా వంద కోట్లు వసూలు చేశాడు. సంక్రాంతికి ఈయన నటించిన ఎఫ్2 సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు 14 రోజుల్లో 112 కోట్లు గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. సీనియర్ హీరోల్లో ఒక్క చిరంజీవి మాత్రమే 100 కోట్లు వసూలు చేశారు.

ఈయన నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమా 160 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాలకృష్ణ గాని.. నాగార్జున కానీ ఎప్పుడూ 100 కోట్ల వైపు అడుగులు వేయలేదు. ఇక వెంకటేష్ కూడా అంతే. కానీ ఇప్పుడు ఈయన నటించిన ఎఫ్2 100 కోట్లు వసూలు చేయడంతో చిరంజీవి తర్వాత ఆ రికార్డు అందుకున్న హీరోగా చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ కూడా తమ ఇమేజ్ కు సరిపోయే కథ పెడితే సీనియర్ హీరోలు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తారని మరోసారి నిరూపించారు వెంకటేష్. ఐదేళ్ల కింద మహేష్ బాబు తోడుగా తొలిసారి 50 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు వెంకటేష్.. ఆ తర్వాత ఇప్పుడు వరుణ్ తేజ్ తోడుగా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా పూర్తి వెంకటేష్ మార్క్ సినిమా గా విమర్శకుల ప్రశంసలు పొందడంతో సినిమా సక్సెస్ వెంకీ కాతా లో పడిపోయింది. నాగార్జున, బాలకృష్ణ కూడా 100 కోట్లు అందుకుంటే సినియర్ హీరోలకు ఒక బెంచ్ మార్క్ సెట్ అయిపోయినట్లే. మరి వాళ్లెప్పుడు ఈ రికార్డు వైపు అడుగేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.