ఫిర్యాదులు చేసిన వారిపైనే కేసులా..?

తన పాలనపై తనకే నమ్మకం లేనంత మహోన్నత పాలన ఏపి సిఎం జగన్ ప్రజలకు అందిస్తున్నారని ఎద్దేవా చేసారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాలో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ అడ్డదారుల్లో పయనిస్తున్నారని స్థానిక సంస్ధలలో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి తీరాలని మంత్రులకు టార్గెట్లు ఇవ్వటం వెనుక ఆంతర్యమిదేనని మండిపడ్డారాయన.
ప్రభుత్వంలోని పెద్దల డైరెక్షన్లలో ఇప్పటికే ప్రకటించిన స్థానిక సంస్ధల రిజర్వేషన్లలో పలు మార్పులు ఎన్నికల కమిషన్ చేస్తూ రివైజ్ చేస్తోందని ఇలా చేయడం సరికాదని అన్నారు. వైసీపీదౌర్జన్యాలనుఎట్టిపరిస్థి తుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పిన ఆయన తమపై దాడి జరిగిందని ఫిర్యాదులు చేసిన వారిపైనే కేసులు పెడుతూ, అరెస్టులు చూపకుండా వారిని కిడ్నాప్ చేయిస్తున్న ఘటనలకు రాష్ట్ర పోలీసులు తెరతీసారని ఆరోపించారు.
స్ధానిక సంస్ధలలో విజయం అడ్డదారిన అందుకోవాలని నిర్ణయించుకున్న జగన్ తన సొంత కడప జిల్లా రాజంపేటలో ఎన్నికల బరిలో దిగేవారిపై ఎరచ్రందనం కేసులు పెడతామని పోలీసులు, వైసిపి పార్టీ నేతలు, శాసనసభ్యులు బెదిరిస్తున్నారని ఈ క్రమంలో స్థానిక సంస్దల ఎన్నికలు ఎంత బాగా జరనున్నాయో అర్ధం చేసుకోవచ్చని అన్నారాయన.