టాలీవుడ్ మీద అయితే కీర్తి శీతకన్నే వేసిందంటున్నారు విశ్లేషకులు.మహానటి తరువాత కీర్తి సురేష్ కూడా త‌న సొంత పేరు  మరిచిపోయి, మహానటి పేరుతో చ‌లామ‌ణి అవుతుంటే ఆనందంతో ఉప్పొంగి పోయింది.  సిని చ‌రిత్రంలో ఊహించ‌ని అద్భుత విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమా తరువాత కీర్తి చాలా బిజీ అయిపోతుంద‌నుకున్నారంతా… కానీ వేళ్ల‌మీద లెక్క‌లేసుకునేన్ని సినిమాలు మాత్ర‌మే ఆమె చెంత‌కొస్తుండ‌టం ఆశ్చ‌ర్య ప‌రిచేదే.
అస‌లు కీర్తి ఇంత‌ నెమ్మదిగా సినిమాలు చేస్తుంటం, నిర్మాత‌ల‌ని ఆక‌ర్షించ‌లేక పోవ‌టానికి కార‌ణ‌మేంట‌ని దుర్భిణీలు వేసిన సినీ విశ్లేష‌కులకు కథ చెప్పడానికి ఎవరైనా వెళితే కీర్తీనే ముప్పుతిప్పలు పెడుతోందట.

కథ, పాత్ర మాత్రమే కాకుండా బడ్జెట్ వంటి విషయాలు కూడా ఆరా తీస్తోందట. వీటితో పాటు వ్యక్తిగత కండిషన్లు పెడుతోందట. ఇన్ని తిప్పలు పడి కీర్తిని ఒప్పించడం కన్నా వేరే హీరోయిన్‌తో చేసుకోవడం బెటరని చాలామంది దర్సకనిర్మాతలు ఆమెతో సినిమాలు చేయడం లేదట. అంతేకాదు ఇలా చేదు అనుభవం ఎదురైన దర్శకనిర్మాతలు కీర్తి సురేష్ కనిపిస్తే చాలు, తప్పించుకుని తిరుగుతున్నారట.
గతంలో ఈ ఇబ్బంది లేకపోయినా ఇటీవల కాలంలో ఈ త‌ర‌హా ఇబ్బందులు మ‌రీ ఎక్కువ‌గా ఎదురవుతుండ‌టం, ఓ వేళ క‌థ విన్నా కాల్షీట్లు ఇచ్చే విష‌యంలో ప‌డుతున్న ఇబ్బందుల వ‌ల్లే కీర్తివైపు తొంగిచూసేందుకు కూడా నిర్మాత‌లు ఇబ్బంది ప‌డుతున్నార‌ట‌.

Leave a Reply

Your email address will not be published.